AP Jobs 2021: దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఏ రాష్ట్రానికైనా వైద్యులు, వైద్య సిబ్బంది, సంబంధిత శాఖల ఉద్యోగులు, హెల్ప్ డెస్క్ సేవల అవసరం రెట్టింపు అవుతుంది. ఈ క్రమంలో  ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్యశాఖ హెల్ప్ డెస్క్ మేనేజర్ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయనున్నామని ప్రకటించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మీలో సేవాగుణం ఉందా, అయితే ఈ ఉద్యోగం మీకోసమే అంటూ ఓ వీడియోను పోస్ట్ చేశారు. నెలకు రూ.15,000 వేతనం అందించనున్నారు. కోవిడ్19 కష్టకాలంలో హల్ప్ డెస్క్ సేవలు అవసరమైన నేపథ్యంలో రిసెప్షనిస్టు(Help Desk Manager) పోస్టులను భర్తీ చేస్తున్నారు. డిగ్రీ అర్హతతో సేవాభావం కలిగి ఉన్న నిరుద్యోగులు కేవలం కరోనా పేషెంట్లకు ఫోన్ ద్వారా సమాచారం అందించడం, ఇతరత్రా వివరాలు ఆన్‌లైన్ ద్వారా అప్‌డేట్ చేయడం వారి పని. 


Also Read: CT Scan For COVID Patients: సీటీ స్కాన్ వల్ల భవిష్యత్తులో క్యాన్సర్ ముప్పు, AIIMS డైరెక్టర్ సంచలన విషయాలు



కరోనా సమయంలో ఉద్యోగులు కోల్పోయిన వారుగానీ, ఇంటి వద్ద ఖాళీగా ఉండకుండా ఏదైనా పని దొరికితే బాగుండు, కరోనా బాధితులకు తమ వంతు సహాయం చేస్తూ ప్రతినెలా రూ.15000 వేతనాన్ని అందుకునే అవకాశం కల్పించారు. కంప్యూటర్ స్కిల్స్, డిగ్రీ అర్హతతో సేవా భావం కలిగిన అసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు వీడియో వీక్షించండి.


Also Read: Risk Factors For Covid-19: కరోనా వీరికి సోకితే మరింత ప్రమాదకరం.. ప్రాణాలు కూడా పోతాయి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook