AP Govt. Jobs 2022: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైతు భరోసా కేంద్రాల్లో భారీగా ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్..
RBK Jobs 2022: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. త్వరలో రైతు భరోసా కేంద్రాల్లో 2,103 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది.
AP Govt. Jobs 2022: ఏపీలో ఉద్యోగాల జాతర మెుదలైంది. ఇప్పటికే గ్రూప్-4, ఎండోమెంట్, గ్రూప్-1 పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం (AP Govt.).. త్వరలో రైతు భరోసా కేంద్రాల్లో 2,103 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఈ మేరకు తర్వలోనే నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ హరికిరణ్ చెప్పారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అగ్రికల్చర్ అసిస్టెంట్, హార్టికల్చర్ అసిస్టెంట్, సిల్క్ బోర్డు అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల్లో అగ్రికల్చర్ అసిస్టెంట్ 437, హార్టికల్చర్ అసిస్టెంట్ 1644, సిల్క్ అసిస్టెంట్ 22 ఉన్నాయి. వీటిని కూడా ఏపీపీఎస్సీ ద్వారానే భర్తీ చేయనున్నారు.
రెండు రోజుల కిందట రాష్ట్రంలోని జిల్లాకోర్టులతోపాటు హైకోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటఫికేషన్ ద్వారా జిల్లా కోర్టుల్లో 3,432, హైకోర్టులో 241 పోస్టుల కలిపి మొత్తం 3,673 పోస్టుల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లు ఇచ్చారు. పోస్టుల సంఖ్య, అర్హతలు, పరీక్ష విధానం తదితర వివరాలను హైకోర్టు వెబ్‌సైట్ hc.ap.nic.in లో పొందుపరిచారు. ఈ పోస్టులను భర్తీ చేయడంలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర ప్రత్యేకంగా చొరవ తీసుకున్నారు. వీటికి ఇప్పటికే ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయింది. అప్లై చేసుకోవడానికి నవంబరు 11 చివరతేదీగా నిర్ణయించారు. అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. జనరల్, బీసీ అభ్యర్థులు రూ.800, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ.400 ఫీజు చెల్లించాలి.
Also read: AP Court Jobs 2022: ఏపీ హైకోర్టు, జిల్లా కోర్టుల్లో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook