Gummanur Jayaram Brothers Wife Revathi Passed Away: ఏపీ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మంత్రి తమ్ముడు నారాయణ స్వామి సతీమణి త్రివేణి ఆకస్మికంగా కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతుండగా.. బెంగుళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్పించారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో కోలుకోలేక మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఆలూరులోని  మంత్రి గుమ్మనూరు తన ఇంటికి రానున్నారు. నాలుగు గంటలకు ఆలూరుకు భౌతికకాయం చేరుకునే అవకాశం అవకాశం ఉంది. సందర్శనార్థం పార్థివదేహాన్ని మధ్యాహ్నాం ఆలూరులోని నివాసంలో ఉంచనున్నట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి అంత్యక్రియలు ఆలూరు పట్టణంలోని మంత్రి సొంత వ్యవసాయ క్షేత్రంలో దహన సంస్కరణలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆమె మరణం పట్ల వైసీపీ నేతలు సంతాపం తెలుపుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మంత్రి గుమ్మనూరు విషయానికి వస్తే.. ఆలూరు ఆయన కంచుకోట అని చెప్పొచ్చు. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరుఫున పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం వైఎస్‌ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో మళ్లీ వైసీపీ నుంచి పోటీ చేసి.. టీడీపీ అభ్యర్థి కోట్ల సుజాతమ్మపై గెలుపొందారు. అనంతరం సీఎం జగన్ మోహన్ రెడ్డి క్యాబినెట్‌లో మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. మంత్రి వర్గ విస్తరణలో గుమ్మనూరుకు మంత్రి పదవి దక్కదని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా మళ్లీ రెండోసారి కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికలకు ముహూర్తం దగ్గర పడుతున్న నేపథ్యంలో గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో బిజీగా ఉంటున్నారు.


రాజకీయంగానూ తన వ్యాఖ్యలకు కాస్త పదును పెట్టారు. సీఎం జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు చేస్తున్న నారా లోకేష్ లోఫర్ గాడు అంటూ ఘాటుగా మాట్లాడుతున్నారు. లోకేష్‌కు రాజకీయాలపై అవగాహన లేదన్నారు. పిల్ల నా కొడుకు పాదయాత్రకు ప్రజల నుంచి స్పందనే లేదని కామెంట్స్ చేశారు. 


Also Read: Pee Gate in Karnataka: బస్సులో నిద్రిస్తున్న మహిళపై మూత్రం పోసిన యువకుడు   


Also Read: Umesh Yadav Father: ఉమేశ్ యాదవ్ ఇంట్లో తీవ్ర విషాదం.. తండ్రి కన్నుమూత  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి