AP LAWCET 2020 Results released: ఏపీ లాసెట్‌ (AP LAWCET 2020) ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. మొదటిసారి విడుదల చేసిన ‘ప్రాథమిక కీ’లో తప్పులు ఉండటంతో మరోసారి అధికారులు ఫలితాలను విడుదల చేశారు. ఈ మేరకు గురువారం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఏపీ లాసెట్ కన్వీనర్‌ జ్యోతి విజయకుమార్, రెక్టార్ కృష్ణానాయక్ ఫలితాలను విడుదల చేశారు. అయితే ఏపీ లాసెట్‌ను 18,371 మంది అభ్యర్థులు పరీక్ష రాయగా.. 11,226 మంది అభ్యర్థులు లాసెట్‌లో ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు వెల్లడించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లాసెట్ అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్‌టికెట్ నెంబర్లను నమోదుచేసి పరీక్ష ఫలితాలను ఇక్కడ చూసుకోవచ్చు..
ఏపీ లాసెట్-2020 ఫలితాల కోసం క్లిక్ చేయండి 


ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో న్యాయ విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (Sri Krishnadevaraya University) అనంతపురం ఆధ్వర్యంలో అక్టోబరు 1న ఏపీ లాసెట్‌ - 2020 పరీక్షను నిర్వహించారు. అయితే ఈ యూనివర్సిటీ ఇటీవల మొదటిసారి విడుదల చేసిన ‘కీ’లో తప్పులు  (AP LAWCET 2020 Answer Key) ఉండటంతో అందరినుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో యూనివర్సీటీ మరోసారి తుది ఫలితాలను విడుదల చేసింది.