ఆంధ్రప్రదేశ్  ( Andhra pradesh ) స్థానిక ఎన్నికల నిర్వహణ మరోసారి తెరపైకి వచ్చింది. ఎన్నికలెప్పుడు నిర్వహిస్తారంటూ ఏపీ హైకోర్టు ప్రశ్నించిన నేపధ్యంలో ఎన్నికల కమీషనర్ రమేష్ కుమార్ వర్సెస్ సీఎం వైఎస్ జగన్ మధ్య మళ్లీ రగడ ప్రారంభమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ( Local Body Elections ) మరోసారి వివాదాస్పదం కానున్నాయా..ఏపీ ఎన్నికల  అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ( SEC Nimmagadda Ramesh kumar ), ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) మధ్య ఘర్షణకు దారి తీయనున్నాయా..పరిస్థితి అలానే కన్పిస్తోంది. పంచాయితీ ఎన్నికల నిర్వహణపై ఓ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించడంతో...ఎప్పుడు నిర్వహిస్తారని కోర్టు ప్రశ్నించింది. కరోనా వైరస్ కారణంగా నిర్వహించలేదని ప్రభుత్వం సమాధానమివ్వడంతో కోర్టు..ఈ అంశాన్ని ఎన్నికల కమీషన్ కు బదిలీ చేసింది. ఇప్పుడు ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టుకు సమాధానం చెప్పాల్సి ఉంది. 


అయితే గతంలో ఇదే ఎన్నికల అంశంపై ప్రభుత్వంతో నిమ్మగడ్డ వివాదం పెట్టుకున్నారు. ఈ ఏడాది మార్చ్ నెలలో స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధమైన సమయంలో హఠాత్తుగా ఎన్నికల అధికారి రమేష్ కుమార్ ఎన్నికల్ని వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అప్పటికి దేశంలో కరోనా వైరస్ విజృంభణ లేకపోయినా...లాక్డౌన్ ప్రకటన జారీ కాకపోయినా ఎన్నికల్ని వాయిదా వేయడంతో ఈ అంశం వివాదాస్పదమైంది. ఎన్నిక‌లు జ‌రిపి తీరాల్సిందేన‌ని జ‌గ‌న్ స‌ర్కారు పట్టుబ‌ట్టింది.  ఈ వివాదం కాస్తా సామాజిక వ‌ర్గాల‌పై విమ‌ర్శ‌లు చేసుకునే వ‌ర‌కు కూడా వెళ్లింది. క‌మిష‌న‌ర్ ప‌ద‌వి కాలం ముగిసేలా ప్రభుత్వం ఓ ఆర్డినెన్స్ తీసుకొచ్చి..మరో వ్యక్తిని ఎన్నికల అధికారిగా నియమించింది. దీనిపై కోర్టును ఆశ్రయించిన నిమ్మగడ్డకు ఉపశమనం లభించింది. కోర్టు ఉత్తర్వులతో మళ్లీ బాధ్యతలు స్వీకరించారు. 


ఇప్పుడు మళ్లీ ఇదే ఎన్నికల నిర్వహణపై హైకోర్టు ( High court ) ఎన్నికల కమీషన్ నుంచి సమాధానం కోరుతోంది. గతంలో నిమ్మగడ్డ అంశంలో నిర్ణయం తీసుకునే ముందు ప్రభుత్వానికి చెప్పాలంటూ సుప్రీంకోర్టు సూచించిన నేపధ్యంలో ఎన్నికల అధికారి రమేష్ కుమార్ ప్రభుత్వాన్ని సంప్రదించే అవకాశముంది. మరి ప్రభుత్వం ఈసారి ఎలా స్పందిస్తుంది..ఎన్నికల నిర్వహణకు అవునంటుందా..కాదంటుందా. అటు ప్రభుత్వం ఇటు నిమ్మగడ్డ రమేష్ కుమార్ మధ్య ఈ అంశానికి పరిష్కారం లభిస్తుందా లేదా. మరోసారి వివాదం రేగుతుందా. Also read: AP; సంచలనంగా మారిన జగన్ లేఖ, జస్టిస్ రమణపై ఆరోపణలు