AP; సంచలనంగా మారిన జగన్ లేఖ, జస్టిస్ రమణపై ఆరోపణలు

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కనీవినీ ఎరుగని చర్య తీసుకున్నారు. అత్యున్నత న్యాయస్థానంలోని ఓ న్యాయమూర్తి..రాష్ట్ర హైకోర్టును ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. ఆధారాలున్నాయంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనమవుతోంది.

Last Updated : Oct 11, 2020, 12:09 PM IST
AP; సంచలనంగా మారిన జగన్ లేఖ, జస్టిస్ రమణపై ఆరోపణలు

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) కనీవినీ ఎరుగని చర్య తీసుకున్నారు. అత్యున్నత న్యాయస్థానంలోని ఓ న్యాయమూర్తి..రాష్ట్ర హైకోర్టును ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. ఆధారాలున్నాయంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖ ( ys jagan letter to CJI ) ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనమవుతోంది.

ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) లో శాసనవ్యవస్థకు అంటే ప్రభుత్వానికి , న్యాయవ్యవస్థకు మధ్య సంఘర్షణ తీవ్రమైపోయిందా..జస్టిస్ రమణ ( Justice Ramana ) పై సీఎం వైఎస్ జగన్ యుద్ధానికి సై అన్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది. నిన్నటివరకూ పరోక్షంగా ఉన్న సంఘర్షణ ఇప్పుడు ముఖాముఖి అయిపోయినట్టే. సుప్రీంకోర్టు జస్టిస్ ఎన్వీ రమణపై ఆరోపణలు చేస్తూ ప్రధాన న్యాయమూర్తికి సీఎం వైఎస్ జగన్ లేఖ రాసి స్వయంగా అందించడం దీనికి కారణం. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి సర్వోన్నత న్యాయస్థానంలోని ఓ న్యాయమూర్తిపై అభియోగాలు మోపుతూ ప్రధాన న్యాయమూర్తికి లేఖ ఇవ్వడం ఇదే తొలిసారి. 

ఏపీలో ప్రభుత్వాన్ని అస్థిరపరిచేలా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ( Chandrababu naidu ) న్యాయవ్యవస్థను ఎంచుకున్నారని, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏపీ హైకోర్టు ఇస్తున్న తీర్పులు, స్టేల వెనుక సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఎన్వీ రమణ జోక్యం ఉందనేది ఏపీ ప్రభుత్వ ఆరోపణ. దీనికి తమవద్ద ఆధారాలున్నాయని ఈ వ్యవహారంపై జోక్యం చేసుకోవాలని ఛీఫ్ జస్టిస్ ఎస్ ఏ బాబ్డే ( Supreme court chief justice S A Bobde ) కు ముఖ్యమంత్రి జగన్ ఫిర్యాదు లేఖ అందించారు. ఇదొక అసాధారణ, సంచలన నిర్ణయంగా వైసీపీ నేతలు చెబుతున్నారు. 

ఇక ఈ అంశాన్ని జాతీయ మీడియా ప్రముఖంగా హైలైట్ చేస్తోంది. జడ్జి ఎన్వీ రమణపై జగన్ యుద్ధం ప్రకటించారంటూ వార్తలు ప్రచురించింది. ఎందుకంటే ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రక్రియలో న్యాయమూర్తి భాగస్వామి అయ్యారని ఆరోపించడం ఇదే తొలిసారి. ఈ లేఖను ఛీఫ్ జస్టిస్  బాబ్డేకు అందించింది ఢిల్లీలో ప్రధాని మోదీ ( Pm Narendra modi ) ను జగన్ కలిసిన రోజే కావడం విశేషం. మరోవైపు గత పదిరోజుల వ్యవధిలో వైఎస్ జగన్ రెండుసార్లు చేయగా...అక్టోబర్ 6న ప్రధాని నరేంద్రమోదీని కలిశారు. అదే రోజు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డేను కలిసి ఫిర్యాదు లేఖను అందించారు. 

రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, సమస్యలపై ఆ భేటీలో చర్చించినట్లు నాడు వార్తలు వచ్చాయి. అయితే, సరిగ్గా అదే రోజు జగన్.. సీజేఐ బాబ్డేను కలిసి.. జస్టిన్ ఎన్వీ రమణపై ఫిర్యాదు లేఖను అందించినట్లు ఆలస్యంగా వెల్లడైంది. Also read: AP High court: ఎన్నికలెప్పుడు నిర్వహిస్తారు?

చంద్రబాబుకు అనుకూలంగా ఏపీ హైకోర్టు వ్యవహరిస్తున్న తీరు, దాని వెనుక జస్టిస్ రమణ పాత్రకు సంబంధించిన ఆధారాలను సీజేఐకి జగన్ ఫిర్యాదు లేఖ అందించిన విషయాన్ని ఏపీ ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లాం  మీడియాకు వెల్లడించారు. అంతేకాదు, జస్టిస్ రమణ గతంలో వెలువరించిన తీర్పులు, ఆయన, ఆయన కుటుంబీకులకు సంబంధించిన ఆస్తుల జాబితాను సైతం జగన్ తన లేఖలో పొందుపర్చడం, వాటిని పబ్లిక్ డొమెయిన్ లో విడుదల చేయడం సంచలనంగా మారింది. 

మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ తో కలిసి జస్టిస్ రమణ ఆస్తులు పోగేశారని జగన్ లేఖలో ప్రస్తావించడం, దానికి ఆధారాలుగా చెబుతోన్న కాపీలను ప్రభుత్వ సలహాదారుడు అజేయ కల్లాం బయటపెట్టడం కలకలం రేపుతోంది. అజయ్ కల్లాం బహిర్గతం చేసిన ఆధారాల్లో జస్టిస్‌ రమణకు సంబంధించి కీలక ఆరోపణల్లో.. ప్రస్తుతం ఏపీ హైకోర్టు ( Ap High court ) లో జడ్జిలుగా ఉన్నవారి నియామకాలు, గతంలో దమ్మలపాటికి అనుకూలంగా వెలువడిన ఉత్తర్వులను ప్రముఖంగా ఉన్నాయి. మొత్తానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాసిన ఫిర్యాదు లేఖ దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనమవుతోంది. శాసనవ్యవస్థలో న్యాయవ్యవస్థ ప్రమేయం ఉందని ఇప్పటికే పార్లమెంట్ సాక్షిగా చర్చ లేపిన వైసీపీ ఎంపీల వ్యవహారం, ఏపీ హైకోర్టు అసాధారణ తీర్పులపై విస్మయం వ్యక్తం చేసిన మేధావుల అంశం మర్చిపోకముందే...తాజా పరిణామాలు చర్చనీయాంశమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ( Ap Government ) తీసుకునే ప్రతి నిర్ణయంపై ఏదో ఒక పిల్ దాఖలు కావడం, హైకోర్టు దానికనుగుణంగా స్టే ఇవ్వడంతో ఏపీ ప్రభుత్వం తాడోపేడో తేల్చుకోడానికి సిద్ధమైనట్టు కన్పిస్తోంది. Also read: Ys jagan letter to CJI: ఆ లేఖలో ఏముందసలు? ఆ ఆరోపణలేంటి ?

 

Trending News