AP lockdown timings మార్పు వార్తల్లో నిజం లేదు: AP govt
Lockdown timings in AP: అమరావతి: ఏపీలో లాక్‌డౌన్ టైమింగ్స్‌లో మార్పులు చేసినట్టు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఏపీ సర్కారు (AP govt) స్పష్టంచేసింది.
Lockdown timings in AP: అమరావతి: ఏపీలో లాక్‌డౌన్ టైమింగ్స్‌లో మార్పులు చేసినట్టు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఏపీ సర్కారు స్పష్టంచేసింది. ఈ నెల 20వ తేదీ నుంచి ఏపీలో అమలు చేయనున్న లాక్‌డౌన్ వేళలు మారుస్తూ ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటన చేసినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రచారాన్ని ఏపీ సర్కారు ఫేక్ కథనాలుగా అభివర్ణించింది. అంతేకాకుండా ఇకపై కూడా లాక్‌డౌన్ సడలింపు వేళలు యధావిధిగా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగుతాయని తేల్చిచెప్పింది.
Also read : Lockdown in Telangana: తెలంగాణలో లాక్‌డౌన్ పొడిగిస్తూ సీఎం కేసీఆర్ ఆదేశాలు
ఏపీలో కరోనా కేసులతో పాటు కరోనాతో చనిపోతున్న వారి సంఖ్య దేశంలోనే 2వ స్థానంలో ఉన్నందు వల్లే లాక్‌డౌన్ టైమింగ్స్ (Lockdown timings) మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్వయంగా ప్రభుత్వమే చేసిన ప్రకటనతో స్పష్టత లభించింది. ప్రభుత్వ ప్రకటనలను తప్పుదోవ పట్టించేలా సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ సర్కారు (AP govt) హెచ్చరించింది.
Also read : Pfizer vaccine: గుడ్ న్యూస్ చెప్పిన ఫైజర్ వ్యాక్సిన్ మేకర్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook