Lockdown in Telangana: తెలంగాణలో లాక్‌డౌన్ పొడిగిస్తూ సీఎం కేసీఆర్ ఆదేశాలు

Lockdown extended in Telangana: హైదరాబాద్: తెలంగాణలో లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 30వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగించనున్నట్టు సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. ముందుగా తెలంగాణలో మే 12 నుంచి పది రోజుల పాటు లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 18, 2021, 10:05 PM IST
Lockdown in Telangana: తెలంగాణలో లాక్‌డౌన్ పొడిగిస్తూ సీఎం కేసీఆర్ ఆదేశాలు

Lockdown extended in Telangana: హైదరాబాద్: తెలంగాణలో లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 30వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగించనున్నట్టు సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. ముందుగా తెలంగాణలో మే 12 నుంచి పది రోజుల పాటు లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. కాగా ఆ గడువు మే 21న శుక్రవారంతో ముగియనున్న నేపథ్యంలో తాజాగా సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. 

తొలుత లాక్‌డౌన్ విధించినప్పుడు కేబినెట్ సమావేశమై నిర్ణయం తీసుకోగా.. తాజాగా సీఎం కేసీఆర్ లాక్‌డౌన్ పొడగింపు అంశంపై ఫోన్ ద్వారా మంత్రుల అభిప్రాయాన్ని తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మంత్రులు కరోనా పరిస్థితిని, వైద్య సదుపాయాలను సమీక్షిస్తూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నందున ఈ నెల 20న జరగాల్సి ఉన్న తెలంగాణ కేబినెట్‌ భేటీని సైతం రద్దు చేశారు. 

Also read : TS EAMCET: తెలంగాణ ఎంసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు

తెలంగాణలో లాక్‌డౌన్ వేళల్లో ఎలాంటి మార్పులు లేవు. తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నందునే లాక్‌డౌన్ (Telangana lockdown) విధానాన్ని కొనసాగించాలని సీఎం కేసీఆర్ (Telangana CM KCR) నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌కి సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

అత్యవసర పరిస్థితుల్లో లాక్‌డౌన్ సమయంలో ఇళ్ల నుంచి బయటికి వచ్చే వారికి పోలీసులు ఈ పాస్ (e-pass rules in Telangana) జారీ చేస్తోన్న సంగతి తెలిసిందే.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News