AP Mega DSC Notification 2024: ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు ఇచ్చిన హామీకు అనుగుణంగా మెగా డీఎస్సీ ఫైలుపై సంతకం చేశారు. మెగా డీఎస్సీలో భాగంగా రాష్ట్రంలో మొత్తం 16,347 టీచర్ పోస్టుల్ని భర్తీ చేయనున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో గత ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు కానుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఏడాది ప్రారంభం జనవరి-ఫిబ్రవరి నెలల్లో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం 6100 టీచర్ పోస్టుల భర్తీకై నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో 2280 సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు, 2299 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 1264 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ పోస్టులు, 215 పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు, 42 ప్రిన్సిపాల్ పోస్టులున్నాయి. డీఎస్సీతో పాటే టెట్ నోటిఫికేషన్ కూడా జారీ అయింది. ఈ రెండు పరీక్షలకు మధ్య సమయం లేకపోవడంతో కొందరు అభ్యర్ధులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. దాంతో డీఎస్సీ పరీక్షలకు కొత్త షెడ్యూల్ విడుదలైంది. అటు టెట్ పరీక్షలు పూర్తయి ప్రాధమిక కీ కూడా రిలీజ్ అయింది. ఈలోగా ఎన్నికల కమీషన్ బ్రేక్ వేయడంతో టెట్ ఫలితాలతో పాటు డీఎస్సీ పరీక్షా కేంద్రాల ఎంపిక ప్రక్రియ నిలిచిపోయింది. 


ప్రస్తుతం ఏపీలో డీఎస్సీ కోసం సిద్ధమయ్యే అభ్యర్ధులంతా టెట్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఫిబ్రవరి 7వ తేదీన ఏపీ టెట్ 2024 నోటిఫికేషన్ విడుదల కాగా 8 నుంచి 18 వరకూ దరఖాస్తులు స్వీకరించారు. ఆ తరువాత ఫిబ్రవరి 26 నుంచి మార్చ్ 9 వరకూ పరీక్షలు జరిగాయి. మార్చ్ 14 వ తేదీ టెట్ ఫలితాలు విడుదల కావల్సి ఉండగా ఎన్నికల కమీషన్ ఆదేశాలతో నిలిచిపోయాయి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో ముందుగా ఏపీ టెట్ 2024 ఫలితాలు విడుదల కానున్నాయి. 


అయితే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం 16 వేల టీచర్ పోస్టుల మెగా డీఎస్సీ ఫైలుపై సంతకంతో త్వరలో నోటిఫికేషన్ విడుదలకు మార్గం సుగమం చేశారు. గత ప్రభుత్వం ఫిబ్రవరి నెలలో విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌లోని 6100 పోస్టులు కూడా ఈ మెగా డీఎస్సీలో కలిపి ఉన్నాయి. దాంతో మొన్నటి నోటిఫికేషన్ రద్దు కావచ్చు. అభ్యర్ధులంతా తిరిగి అప్లై చేసుకోవల్సి ఉంటుంది. లేదా అదే అప్లికేషన్లు కొనసాగించవచ్చు. 


Also read: Chandrababu naidu: సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు.. తొలి సంతకం ఈ ఫైల్ మీదే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook