Ambati on Puvvada: భద్రాచలంలో వరదలు వస్తే పోలవరం కారణమవుతుందా..అంబటి ధ్వజం..!
Ambati on Puvvada: తెలుగు రాష్ట్రాల మధ్య మరో రగడ మొదలైంది. పోలవరం ప్రాజెక్ట్, ముంపు గ్రామాలపై ఇరు రాష్ట్రాల మంత్రులు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా ఏపీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు.
Ambati on Puvvada: తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ వ్యాఖ్యలకు ఏపీ మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఎలాంటి గొడవలు, వివాదాలు లేవని..కొత్తవి సృష్టించే ప్రయత్నం చేయొద్దన్నారు. పోలవరం ప్రాజెక్టుకు భద్రాచలానికి ముడిపెట్టడం సరైనది కాదని చెప్పారు. పువ్వాడ అజయ్ వ్యాఖ్యలపై హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ గెస్ట్ హౌస్‌లో స్పందించారు.
గోదావరికి వరదలు వచ్చిన ప్రతిసారి తెలంగాణ, ఏపీలోని కొన్ని ప్రాంతాలు నీట మునుగుతున్నాయన్నారు. మనమంతా తెలుగు వాళ్లమని..తెలంగాణలో టీఆర్ఎస్, ఏపీలో వైసీపీ పాలిస్తోందని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. నిబంధనల ప్రకారం పోలవరం ప్రాజెక్ట్‌కు కేంద్రం అన్ని అనుమతులు ఇచ్చిందన్నారు. ప్రాజెక్ట్ వల్ల ఏడు మండలాలకు ఇబ్బందిగా మారుతుందనే ఏపీలో కలిపారని గుర్తు చేశారు.
భద్రాచలంలో వరదలు వస్తే పోలవరం ఎలా కారణమవుతుందని ప్రశ్నించారు మంత్రి అంబటి రాంబాబు. 5 గ్రామాలు ఇవ్వమంటే..భద్రాచలం తమదని అంటామని..ఇస్తారా అని మండిపడ్డారు. 5 గ్రామాలు కావాలంటే కేంద్రాన్ని అడగాలని సూచించారు. పోలవరం ఎత్తు విషయంలో సీడబ్ల్యూసీకి సమాచారం ఇచ్చామని స్పష్టం చేశారు. గోదావరి, కృష్ణా బోర్డులను సంప్రదించకుండా టీవీల ముందు మాట్లాడితే ఎలా ప్రశ్నించారు.
Also read:Minister Harish Rao: తెలంగాణ ప్రజలకు శుభవార్త..త్వరలో కొత్త పెన్షన్లు, రేషన్ కార్డులు..!
Also read:Monkeypox: ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ కలవరం..అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్య నిపుణులు..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook