Privilege notices : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌పై ప్రభుత్వం కౌంటర్ ఎటాక్ ప్రారంభించింది. మంత్రులు బొత్స, పెద్దిరెడ్డిలు నిమ్మగడ్డపై సభా ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు. నిమ్మగడ్డ పరిధి దాటుతున్నారనేది నోటీసుల సారాంశం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ( Nimmagadda Ramesh Kumar ) వ్యవహారశైలి వివాదాస్పదంగా మారుతోంది. సుప్రీంకోర్టు ( Supreme court ) తీర్పు అనంతరం ఎన్నికలకు ప్రభుత్వం ( Ap Government ) సహకరిస్తున్నా..పేచీ పెట్టుకునే ధోరణిలో సాగుతున్నారు నిమ్మగడ్డ రమేశ్ కుమార్. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం, పరిధి దాటి వ్యవహరించడం ఆయనపై తాజాగా వచ్చిన ఆరోపణలు. ఇప్పటికే అధికార పార్టీ నేతలు మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డిలు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌పై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. 


ప్రభుత్వ సలహాదారుడిగా సజ్జల రామకృష్ణారెడ్డిని తప్పించాలని, మంత్రులు బొత్స సత్యనారాయణ ( Minister Botsa Satyanarayana ), పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ( Minister Peddireddy Ramachandra reddy ) లపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమీషన్ నిమ్మగడ్డ గవర్నర్ ( Governor ) ‌కు లేఖ రాయడం ప్రభుత్వ ఆగ్రహానికి కారణమైంది. తమ హక్కులకు భంగం కలిగే విధంగా ఎన్నికల కమీషనర్ వ్యవహరించారంటూ మంత్రులు బొత్స, పెద్దిరెడ్డిలు ఏపీ స్పీకర్‌కు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ( Privilege notices ) అందించారు. నిమ్మగడ్డ తన పరిధి దాటి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పార్టీ రహితంగా జరుగుతున్న ఎన్నికల్లో తెలుగుదేశం ( Telugu Desam ) పార్టీ మేనిఫెస్టో విడుదల చేసినా నిమ్మగడ్డ చర్యలు తీసుకోకుండా పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని అధికారపార్టీ ఆరోపిస్తోంది. ఈ విషయంపై కూడా నిమ్మగడ్డపై కోర్టులో కేసు వేసే అవకాశాలున్నాయి. సభా హక్కుల ఉల్లంఘన నోటీసుల ద్వారా నిమ్మగడ్డ పూర్తిగా ఇరుకున పడే అవకాశాలున్నాయి. 


Also read: South Central Railway: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 31 స్టేషన్లు క్లోజ్..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook