AP MPTC, ZPTC Elections : ఏపీలో ప్రశాంతంంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్
AP MPTC And ZPTC Elections 2021 held peacefully : వివిధ కారణాలతో అప్పట్లో ఆగిపోయిన, గెలిచినవారు చనిపోయిన కారణంగా ఆయా స్థానాల్లో ఎన్నికలు సాగుతున్నాయి. ఇవికాకుండా గతంలో ఓట్ల లెక్కింపు సమయంలో తడిసిన ఓట్ల కారణంగా లెక్కింపు ఆగిపోయిన జమ్మలమడుగు జెడ్పీటీసీ స్థానంలో రెండు బూత్‌లతోపాటు మరో ఆరు ఎంపీటీసీ స్థానాల్లోను మంగళవారం ఫ్రెష్ పోల్ నిర్వహిస్తున్నారు.
AP MPTC And ZPTC Elections 2021 going on peacefully: ఏపీలో వివిధ కారణాలతో నిలిచిపోయిన జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 10 జడ్పీటీసీ (ZPTC) స్థానాలకు, 123 ఎంపీటీసీ (MPTC) స్థానాలకు మంగళవారం ఎన్నికలు జరుగుతున్నాయి. వివిధ కారణాలతో అప్పట్లో ఆగిపోయిన, గెలిచినవారు చనిపోయిన కారణంగా ఆయా స్థానాల్లో ఎన్నికలు సాగుతున్నాయి. ఇవికాకుండా గతంలో ఓట్ల లెక్కింపు సమయంలో తడిసిన ఓట్ల కారణంగా లెక్కింపు ఆగిపోయిన జమ్మలమడుగు జెడ్పీటీసీ స్థానంలో రెండు బూత్‌లతోపాటు మరో ఆరు ఎంపీటీసీ స్థానాల్లోను ఫ్రెష్ పోల్ నిర్వహిస్తున్నారు. మొత్తం 14 జెడ్పీటీసీ స్థానాలు, 176 ఎంపీటీసీ స్థానాల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీచేశారు. వీటిలో నాలుగు జెడ్పీటీసీ స్థానాలు, 50 ఎంపీటీసీ (MPTC) స్థానాల ఎన్నిక ఏకగ్రీవం అయ్యాయి. మూడు ఎంపీటీసీ స్థానాల్లో ఎవరూ నామినేషన్ల దాఖలు చేయకపోవడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. మిగిలినచోట్ల 954 పోలింగ్ కేంద్రాల్లో మంగళవారం ఉదయం నుంచి పోలింగ్ మొదలైంది. జడ్పీటీసీ స్థానాల్లో 40 మంది, ఎంపీటీసీ స్థానాల్లో 328 మంది పోటీలో ఉన్నారు. ఓట్లను ఈనెల 18న లెక్కిస్తారు.
కాగా అంతటా పోలింగ్ (Polling) ప్రశాంతంగా కొనసాగింది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతపురం జిల్లాలోని (Anantapur District) చిలమత్తూరు జెడ్పీటీసీ, 16 ఎంపీటీసీలకు జరిగిన ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5కు పోలింగ్ కేంద్రాల గేట్స్‌ను అధికారులు మూసేశారు. 5 గంటల తర్వాత క్యూలైన్లలో ఉన్న వారికి మాత్రమే ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో 65 శాతం పోలింగ్ నమోదైంది.
నెల్లూరు జిల్లా కోట జడ్పీ హైస్కూల్లో జరుగుతున్న ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ సరళిని ఆర్డీఓ మురళీకృష్ణ పరిశీలించారు. పశ్చిమగోదావరి జిల్లా (West Godavari District) పెనుగొండ మండలం జెడ్పీటీసీ ఎన్నికలో సాయంత్రం 4 గంటల వరకు 65.2 శాతం పోలింగ్ నమోదైంది.
ప్రకాశం జిల్లా (Prakasam District) పిసి పల్లి మండలం మురుగమ్మి ఎంపీటీసీ స్థానంలో 78శాతానికి పైగానే పోలింగ్ నమోదైంది. ఇక విశాఖ జిల్లా ఆనందపురం మండలం వెల్లంకి, వేములవలస జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ మల్లికార్జున పరిశీలించారు. జిల్లాలో జరుగుతోన్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఇప్పటి వరకు 51 శాతం పోలింగ్ నమోదైంది.
Also Read : Metal Astrology: రంగు రాళ్లే కాదు.. ఈ రాశివారికి లోహాలు కూడా మంచి ఫలితాలిస్తాయి
నెల్లూరు జిల్లా (Nellore District) సైదాపురం మండలం ఆనంతమడుగు ఎంపీటీసీ స్థానానికి పోలింగ్ జరుగుతోన్న తీరును పరిశీలకులు బసంత్ కుమార్, గూడూరు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి పరిశీలించారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం నడింపాలెంలో సాగుతోన్న ఎంపీటీసీ ఎన్నికలను గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరీఫ్ పరిశీలించారు.
కర్నూలు జిల్లాలో (Kurnool District) నంద్యాల జడ్పీటీసీ, బైచిగేరి, ధనాపురం, హానవాలు, చాగలమర్రి, టి. గోకులపాడు, మల్లేపల్లి, చాకరాజువేముల ఎంపీటీసీ స్థానాల్లో పోలింగ్ జరిగింది. ఇక్కడ మధ్యాహ్ననానికే 50.18 శాతం పోలింగ్ పైనే నమోదైంది. అలాగే కర్నూల్ జిల్లా కృష్ణగిరి మండలం టి.గోకులపాడు ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగింది. పశ్చిమగోదావరిజిల్లా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. కృష్ణా జిల్లాలోని (Krishna District) జి.కొండూరులో జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ సిద్దార్ధ్ కౌశల్ పరిశీలించారు.
ఎన్నికలు జరిగిన అన్ని ప్రాంతాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలివచ్చారు. వృద్దులు, వికలాంగులుకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇబ్బంది లేకుండా పోలింగ్ (Polling) కేంద్రాల వద్ద వీల్ చైర్లను ఏర్పాటు చేశారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 పోలీసులు (Police) సెక్షన్ అమలు చేశారు.
Also Read : Best Tourism Village: బెస్ట్ టూరిజం విలేజ్ గా పోచంపల్లి.. ఐక్యరాజ్యసమితి గుర్తింపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook