ఆంధ్రప్రదేశ్ లో మరోసారి కరోనా కేసులు విజృంభించాయి. రాష్ట్రంలో కరోనా పరీక్షలు పెరిగే కొద్దీ కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో ఏకంగా 4 వేల 994 కేసులు నమోదవడం భయం గొలుపుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ 19 వైరస్ సంక్రమణ భయాందోళనలు రేపుతోంది. ప్రతిరోజూ 3-5 వేల మధ్య కేసులు నమోదవుతున్నాయి.తాజాగా గత 24 గంటల్లో 4 వేల 994 కేసులు నమోదవడం భయం గొలుపుతోంది. ఇప్పటివరకూ రాష్ట్రంలో 58 వేల 668 కరోనా కేసులు నమోదయ్యాయి.ఓ వైపు రాష్ట్రంలో కోవిడ్ 19 నిర్ధారణ పరీక్షల సామర్ధ్యం గణనీయంగా పెరిగింది. పరీక్షలు పెరిగే కొద్దీ కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 37 వేల 162 పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ఏపీలో  32 వేల 336 యాక్టివ్ కేసులున్నాయి. మృతుల సంఖ్య 758కు చేరుకుంది. ఇప్పటివరకూ ఏపీలో రికార్డు స్థాయిలో 13 లక్షల 86 వేల 274 పరీక్షలు చేశారు. 


ఇంటింటా కోవిడ్ 19 నిర్ధారణ పరీక్షలు చేయాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచన మేరకు రాష్ట్రంలో ప్రత్యేక కోవిడ్ టెస్ట్ బస్సుల్ని నడుపుతున్నారు. దాంతో గ్రామాల్లో సైతం పరీక్షల సామర్ధ్యం పెద్దఎత్తున పెరిగింది. మరోవైపు కోవిడ్ 19 వైరస్ కట్టడి కోసం అతిపెద్ద కోవిడ్ కోర్ సెంటర్ ను కూడా 15 వందల బెడ్స్ సామర్ధ్యంతో నిర్మిస్తున్నారు. Also read:AP: రేపు మధ్యాహ్నం కేబినెట్ విస్తరణ