ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) నూతన మంత్రుల ప్రమాణ స్వీకారం ముగిసింది. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ( Governor Biswabhushan harichandan ) కొత్త మంత్రులతో ప్రమాణం చేయించారు. ఏపీ ముఖ్యమంత్రి వైెఎస్ జగన్, స్పీకర్ తమ్మినేని తదితరుల సమక్షంలో కేబినెట్ లో కొత్త మంత్రులు చేరారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ( Ap cabinet ministers )లో మంత్రులుగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ ( Pilli Subhash chandra bose ), మోపిదేవి వెంకట రమణ ( Mopidevi venkata ramana )లు రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఏపీ కేబినెట్ లో రెండు బెర్త్ లు ఖాళీ అయ్యాయి. రెండూ బీసీ సామాజికవర్గానికి చెందినవి కావడంతో తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ( Ch Venugopala krishna ), శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే అప్పలరాజు ( Appala raju )లకు కొత్త కేబినెట్ లో చోటు కల్పించారు వైఎస్ జగన్. 


విజయవాడలోని రాజ్ భవన్ లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మధ్యాహ్నం 1 గంట 29 నిమిషాలకు..ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ), స్పీకర్ తమ్మినేని సీతారామ్ ( Speaker Tammineni Sitaram ) సమక్షంలో కొత్త మంత్రులతో ప్రమాణం చేయించారు. చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు ఆర్ అండ్ బీ శాఖ దక్కగా..పశుసంవర్ధక, మత్స్యకార శాఖ అప్పలరాజుకు లభించింది. ఈ ఇద్దరు తొలిసారి శాసనసభకు ఎన్నికైనవారు కావడం విశేషం. Also read: Ys Jagan: కోర్టుల ద్వారా టీడీపీ ఆటంకాలు