Pawan Kalyan: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో పర్యటన షెడ్యూల్ మారింది. ఇవాళే ఆయన రాష్ట్రానికి వస్తున్నట్లు ప్రకటించారు. నేడు పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నట్లు తెలుస్తుంది.
Taneti Vanitha : జన సేనకు ఓ మేనిఫేస్టో లేదని, ఓ ఎజెండా లేదని విమర్శించారు ఏపీ మంత్రి తానేటి వనిత. అసలు ఎన్నికల గుర్తే లేని వాళ్ల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ మళ్లీ సీఎం అవుతాడని ధీమా వ్యక్తం చేసింది.
Akhila priya : నంద్యాల జిల్లాలోని కొత్తపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. నారా లోకేష్ ముందే ఏవీ సుబ్బారెడ్డిపై అఖిల ప్రియ వర్గీయులు దాడి చేశారు. ఘటనలో ఆయనకు గాయాలయ్యాయి. దమ్ముంటే డైరెక్ట్‌గా రావాలని సవాల్ విసిరారు. రంగంలోకి దిగిన పోలీసులు సమస్యను పరిష్కరించారు.
KA Paul : వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పొత్తులుంటాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలపై కేఏ పాల్ స్పందించాడు. అతను పాకేజ్ స్టార్ అని దుయ్యబట్టాడు. బీజేపీ మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. స్పెషల్ పాకేజీ ఇవ్వలేదు సరికదా స్టీల్ ప్లాంట్‌ని కూడా అమ్మేస్తోంది అంటూ కేఏ పాల్ ఫైర్ అయ్యాడు.
Perni Nani : చంద్రబాబు కోసమే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడంటూ మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. రైతుల పరామర్శ పేరుతో చంద్రబాబు అనుకూల రాజకీయం చేస్తున్నాడని ఫైర్ అయ్యాడు. ఆరు నెలలకొకసారి రోడ్డు మీదకు వస్తుంటాడు అంటూ మండిపడ్డాడు.
Pawan Kalyan : తూర్పు గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటించారు. అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులకు అండగా నిలిచారు. కడియం, కొత్తపేట, పీ గన్నవరంలో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఉదయం రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకోనున్నారు.
Dhulipala Narendra : ఏపీలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని టీడీపీ సీనియర్ నేత ధూళిపాల నరేంద్ర అన్నారు. తడిసిన ధాన్యాన్ని కొనే పరిస్థితి లేదని అన్నారు. తక్షణమే అన్నదాతను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల పక్షాన తాము పోరాడుతామని అన్నారు.
Taneti Vanitha : సిట్ విచారణ నుంచి ప్రజల దృష్టిని మళ్లించే క్రమంలోనే చంద్రబాబు రైతుల సమస్యలంటూ కొత్త నాటకమాడుతున్నారని రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ల డ్రామాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు.
Chitfund Case : జగజ్జనని చిట్ ఫండ్ కేసులో అరెస్టైన మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావ్, టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త ఆదిరెడ్డి శ్రీనివాస్‌కు కోర్టు రిమాండ్ విధించింది. మే 12 వరకు రిమాండ్ విధిస్తూ తూర్పుగోదావరి జిల్లా కోర్టు తీర్పునిచ్చింది.
Balineni Srinivas Reddy : బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైఎస్సార్సీపీకి షాక్ ఇచ్చాడు. రీజనల్ కో ఆర్డినేటర్ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. చిత్తూరు నెల్లూరు తిరుపతి జిల్లాలకు కో ఆర్డినేటర్‌గా ఉన్న ఆయన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.
AP TIDCO houses to be handed over to beneficiaries by April 2023. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఏప్రిల్ నెలలో రాష్ట్రంలోని ఒక లక్ష 50 వేల టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అందజేయడానికి పనులు శరవేగంగా సాగుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.