AP Nominated Posts: ఏపీలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నామినేషన్ పదవుల పందేరం పూర్తయింది. రాష్ట్ర, జిల్లా స్థాయి నామినేటెడ్ పదవుల్ని ప్రకటించారు. మహిళలు, బీసీ, ఎస్సీలకు నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఇచ్చారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో రాజకీయ పదవుల పందేరం ప్రారంభమైంది.పెద్దఎత్తున నామినేటెడ్ పోస్టుల్ని(Ap Nominated Posts)ప్రకటించారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో 135 పోస్టుల్లో 68 మహిళలకు, 67 పురుషులకు కేటాయించారు. నామినేటెడ్ పదవుల్లో మహిళలు, బీసీలు, ఎస్సీలకు పెద్దపీట వేశారు. నామినేటెడ్ పదవులు అలంకారప్రాయం కాదని..పదవులు పొందినవారు బాథ్యతాయుంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. పదవుల భర్తీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్(Ap cm ys jagan)సామాజిక న్యాయం పాటించారన్నారు. 


కాపు కార్పొరేషన్ ఛైర్మన్‌గా జక్కంపూడి రాజా(Jakkampudi Raja)స్థానంలో అడపా శేషును నియమించారు.సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ద్వారంపూడి భాస్కర్ రెడ్డిని నియమించారు.తూర్పు గోదావరి జిల్లా డీసీసీబీ ఛైర్మన్‌గా అనంతబాబు స్థానంలో ఆకుల వీర్రాజును నియమించారు. ఏపీ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఎం అరుణ్ కుమార్, ఏపీ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా షేక్ ఆసిఫ్‌లను నియమించారు. ఏపీ స్టైట్ హౌసింగ్ కార్పొరేషన్ (Ap State Housing Corporation) ఛైర్మన్‌గా దవులూరి దొరబాబు, రాజమండ్రి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా మేడపాటి షర్మిలా రెడ్డి, రాజమండ్రి స్మార్ట్ సిటీ ఛైర్మన్‌గా చందన రమేశ్‌లను నియమించారు. 


Also read: Krishna Flood Water: కృష్ణా, గోదావరి నదుల్లో పెరుగుతున్న వరద ప్రవాహం, దిగువకు నీటి విడుదల


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook