Ap first phase panchayat elections polling: తొలిదశ పంచాయితీ ఎన్నికల పోలింగ్, జిల్లాల వారీగా పోలింగ్ శాతం వివరాలు
First phase panchayat polling live updates: ఆంధ్రప్రదేశ్ పంచాయితీ ఎన్నికల తొలిదశ పోలింగ్ నడుస్తోంది. ఉదయం 12.30 గంటల వరకూ 62 శాతం పోలింగ్ నమోదైనట్టు తెలుస్తోంది. సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ ప్రాంతాల్లో వెబ్ కెమేరాల పర్యవేక్షణ కొనసాగుతోంది.
First phase panchayat polling live updates: ఆంధ్రప్రదేశ్ పంచాయితీ ఎన్నికల తొలిదశ పోలింగ్ నడుస్తోంది. ఉదయం 12.30 గంటల వరకూ 62 శాతం పోలింగ్ నమోదైనట్టు తెలుస్తోంది. సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ ప్రాంతాల్లో వెబ్ కెమేరాల పర్యవేక్షణ కొనసాగుతోంది.
రాష్ట్ర వ్యాప్తంగా తొలిదశ పంచాయితీ ఎన్నికల పోలింగ్ ( First phase panchayat elections polling ) మందకొడిగానే కొనసాగుతోంది. ఉదయం 12.30 గంటల వరకూ దాదాపు 62 శాతం పోలింగ్ నమోదైనట్టు తెలుస్తోంది. మధ్యాహ్నం 3.30 గంటల వరకూ పోలింగ్ జరగనుండగా..అనంతరం కౌంటింగ్ ( Counting ) ప్రక్రియ ప్రారంభమవుతుంది. కమాండ్ సెంట్రల్ సెంటర్ నుంచి సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కెమేరా ( Web camera )ల ద్వారా పర్యవేక్షణ జరుగుతోంది.
రాష్ట్రవ్యాప్తంగా 7 వేల కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ( Webcasting ) ఏర్పాటైంది. విజయనగరం మినహా మిగిలిన 12 జిల్లాల్లో తొలిదశ పంచాయితీ ఎన్నికల ( Panchayat elections ) పోలింగ్ జరుగుతోంది. తొలిసారిగా పంచాయితీ ఎన్నికల్లో నోటా ప్రవేశపెట్టారు. కరోనా బాధితులకు మాత్రం పీపీఈ కిట్ల సహాయంతో చివర్లో గంటసేపు అవకాశం కల్పించనున్నారు.
ఉదయం 12.30 గంటల వరకూ నమోదైన పోలింగ్ శాతం ( First phast panchayat elections live updates )
తూర్పు గోదావరి జిల్లాలో 62.14 శాతం, పశ్చిమగోదావరిలో 54.09 శాతం, కృష్ణా జిల్లాలో 67 శాతం పోలింగ్ నమోదైంది. అటు గుంటూరులో 62 శాతం, కడపలో 61.19 శాతం, అనంతపురంలో 63 శాతం పోలింగ్ నమోదైంది. ప్రకాశం జిల్లాలో 57 శాతం, నెల్లూరులో 61 శాతం, చిత్తూరులో 66.3 శాతం పోలింగ్ నమోదైంది. కర్నూలు జిల్లాలో 70.16 శాతం, విశాఖలో 65 శాతం, శ్రీకాకుళం జిల్లాలో 54.5 శాతం పోలింగ్ నమోదైనట్టు తెలుస్తోంది.
Also read: Supreme court: అమరావతి భూకుంభకోణం కేసులో టీడీపీ నేతలపై సుప్రీంకోర్టు ఆగ్రహం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook