Kodi Pandalu: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ అంగరంగ వైభవంగా చేసుకుంటారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో అయితే ఈ పండుగ ఒక జాతరలా జరుగుతుంటుంది. ఇక ఈ పండుగకు కోళ్లపందేలు అదనపు ఆకర్షణ. దాదాపుగా ఏపీలోని అన్ని జిల్లాల్లో కోళ్ల పందేలు జరుగుతాయి. పండుగ రెండు వారాల ముందు నుంచి కోడి పందేళ్ల బరులు సిద్ధమవుతుంటాయి. అయితే పండుగ సందర్భంగా కోళ్ల పందెం ప్రియులకు పోలీసులు భారీ షాక్‌ ఇచ్చారు. కోడి పందేలుకు ఎలాంటి అనుమతి లేదని మైక్‌లు పెట్టి మరీ ప్రచారం చేస్తున్నారు. ఈ మేరకు కొన్ని ప్రాంతాల్లో ఊరూరా మైకులు పెట్టుకుని తిరుగుతున్నారు. ఈ వార్త వైరల్‌గా మారింది. అయితే పోలీసుల ఆదేశాలను మాజీ ఎమ్మెల్యే వర్మ బేఖాతరు చేస్తున్నారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: New Year Gift: పేదలకు సీఎం చంద్రబాబు కొత్త సంవత్సర గిఫ్ట్‌.. రూ.24 కోట్లు విడుదల


కోడి పందేళ్లకు గోదావరి జిల్లాలు పేరుగాంచాయి. అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా కోడిపందాలకు ఎలాంటి అనుమతులు లేదని పోలీసులు ప్రచారం మొదలుపెట్టారు. ఆటోలకు మైకులు  కట్టి ప్రచారం నిర్వహిస్తున్నారు. కోడిపందాలు ఆడితే కేసులు పెడతామని జిల్లాలోని అన్ని పోలీస్‌ స్టేషన్లకు ఇప్పటికే సమాచారం అందించారు. ఈ విషయాన్ని అందరికీ చెప్పాలని ఆదేశాలు రావడంతో పోలీసులు ప్రచారం చేసేందుకు ఆటోలు కట్టి తిప్పుతున్నారు. తమ సంస్కృతి అయిన కోడి పందాలకు అనుమతి ఇవ్వకపోవడంపై ఉదయ గోదావరి జిల్లా ప్రజలు తప్పుబడుతున్నారు.

Also Read: Game Changer: ఏపీకి తరలివెళ్లిన గేమ్‌ ఛేంజర్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌.. అల్లు అర్జున్‌ వ్యవహారమే కారణం?


పరిస్థితి ఇలా ఉంటే ఈ పోలీసులను ఆదేశాలను పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ బేఖాతరు చేస్తున్నారు. పోలీసులకు బస్తీమే సవాల్ అంటున్నారు. ఈ క్రమంలోనే నూతన సంవత్సరం సందర్భంగా వర్మ కోళ్ల పందేలు నిర్వహించారు. కోడిపందేలపై వెనక్కి తగ్గబోమని బుధవారం వర్మ చాటి చెప్పారు. నూతన సంవత్సర వేళ బరిలో కోడిపుంజులు తీసుకువచ్చి పందాలు ఆడించారు.


అయితే పోలీసుల ఆదేశాలను ఉప ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పిఠాపురంలోనే పట్టించుకోకపోవడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. పోలీసుల నిబంధనలు డిప్యూటీ సీఎం నియోజకవర్గంలో పాటించరా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీ అయితే పోలీసులు పట్టించుకోరా? అనే సందేహం వస్తోంది. కాగా తరతరాలుగా వస్తున్న ఈ సాంప్రదాయాన్ని రక్షించాలని గోదావరి జిల్లా ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. తమిళనాడులో జల్లికట్టు మాదిరి ఏపీలో కోడిపందాలు అని చెబుతున్నారు. మరి సంక్రాంతి సమయానికి పోలీసులు ఏం చేస్తారో అనేది ఆసక్తికరంగా మారింది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook