AP PRC issue New Update: ఏపీలో కొత్త పీఆర్సీ జీవోలకు సంబంధించిన అంశంపై ఉద్యోగ సంఘాల నేతలతో మరోసారి చర్చలు జరిపేందుకు సిద్ధమైంది రాష్ట్ర ప్రభుత్వం. రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు మినిస్టర్స్‌ కమిటీతో చర్చలకు రావాలంటూ ఏపీ ప్రభుత్వం పిలుపునిచ్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక పీఆర్సీ (PRC) సాధన సమితి సభ్యులకు కూడా ఈ మేరకు ఇప్పటికే ప్రభుత్వం తరఫున లేఖ వెళ్లింది. పీఆర్సీ జీవోల్ని (PRC GO's) వెనక్కి తీసుకోకుంటే సమ్మెకు దిగుతామని ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలు సమ్మె నోటీస్‌ ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం మినిస్టర్స్‌తో కమిటీని (Ministers Committee) ఏర్పాటు చేసింది.


ఇక వారితో చర్చించేందుకు కూడా కమిటీ సభ్యులెవరూ ముందుకు రాకపోవడంతో... కొత్త పీఆర్సీ ప్రకారం శాలరీలు ఇచ్చేందుకు గవర్నమెంట్ ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది. ఆ మేరకు మంగళవారం ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు జమ చేయాలని భావిస్తోన్న తరుణంలో ప్రభుత్వం (Government) మరోసారి చర్చలకు ఆహ్వానించింది. దీంతో ఇప్పుడు ఈ చర్చల ఆహ్వానం అంశం కాస్త ఆసక్తిగా మారింది.


కాగా పీఆర్సీ (PRC) విష‌యంలో మాత్రం తాము ఏమాత్రం కూడా వెన‌క్కి త‌గ్గేదేలే అని పీఆర్సీ సాధన సమితి నేత‌లు అంటున్నారు. చ‌ర్చ‌ల‌కు వెళ్లేందుకు వాళ్లు చాలా షరతులు పెట్టారు. ప్రభుత్వం వాటన్నింటికీ ఒప్పుకుంటేనే చర్చలకు వెళ్తామంటున్నారు.


Also Read: Medaram Jatara Bus Timings: మేడారం జాతరకు స్పెషల్ బస్సులు.. ఏఏ సమయాల్లో అందుబాటులో ఉంటాయంటే?


Also Read: Telangana Covid Cases: తెలంగాణ మరోసారి పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్ని కేసులంటే?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook