Telangana Covid Cases: తెలంగాణ మరోసారి పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్ని కేసులంటే?

Telangana Covid Cases: తెలంగాణలో రోజువారి కొవిడ్ కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,861 మందికి కరోనా సోకింది. రాష్ట్రంలో కరోనా మహమ్మారి ధాటికి మరో ముగ్గురు మరణించినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఓ బులిటెన్ లో వెల్లడించింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 31, 2022, 08:58 PM IST
    • తెలంగాణలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు
    • కొత్తగా 2,861 మందికి కరోనా పాజిటివ్
    • కరోనా ధాటికి మరో ముగ్గురు మృతి
Telangana Covid Cases: తెలంగాణ మరోసారి పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్ని కేసులంటే?

Telangana Covid Cases: తెలంగాణ రాష్ట్రంలో రోజువారీ కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. కొత్తగా రాష్ట్రంలో 2,861 మంది కరోనా బారిన పడినట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో 80,138 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు స్పష్టం చేసింది. కరోనా ధాటికి మరో ముగ్గురు ప్రాణాలు విడిచారు. 37,168 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఓ బులిటెన్ విడుదల చేసింది. 

కొవిడ్ మహమ్మారి నుంచి కొత్తగా మరో 4,413 మంది కోలుకున్నారు. తెలంగాణలో కరోనా రికవరీ రేటు 96.31 శాతంగా ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 7,11,656 మందికి కరోనా సోకిందని గణాంకాల ద్వారా వెల్లడవుతుంది. కరోనా ధాటికి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,060కి చేరిందని తెలుస్తోంది. 

జీహెచ్​ఎంసీ పరిధిలో కొత్తగా 746 కరోనా కేసులు నమోదైనట్లు తెలంగాణ వైద్యారోగ్య శాఖ స్పష్టం చేసింది. హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రి తో పాటు ఎర్రగడ్డలోని మానసిక ఆస్పత్రులతో భారీగా కొవిడ్ బాధితులు పెరిగిపోతున్నారు. 

ఒక్క గాంధీ ఆస్పత్రిలోనే 70 మందికి పైగా వైద్యులు, సిబ్బందికి కరోనా సోకడం వల్ల అధికారులను కలవరానికి గురిచేస్తోంది. ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రిలో 9 మంది వైద్యులతో పాటు 57 మంది రోగులకు కొవిడ్ వైరస్ సోకినట్లు తేలింది. మరోవైపు పోలీస్ శాఖలో కూడా అనేక మంది కరోనా బారిన పడుతున్నట్లు తెలుస్తోంది.  

Also Read: Telangana: తెలంగాణలో మళ్లీ రిజిస్ట్రేషన్ ఛార్జీల బాదుడు... పెరగనున్న భూముల ధరలు

Also Read: Telangana Covid Tests: TRS సర్కార్ ప్రజల జీవితాలతో ఆడుకుంటుంది: సోషల్ మీడియాలో వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News