AP PRC issue Latest Updates: ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితో ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ సమావేశమయ్యారు. ఏపీ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన పీఆర్సీ జీఓలను రద్దు చేయాలంటూ చేపట్టిన "చలో విజయవాడ" కార్యక్రమంపై డీజీపీతో సీఎం చర్చించినట్లు సమాచారం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చలో విజయవాడ (Chalo Vijayawada) సక్సెస్ అయిన నేపథ్యంలో వీరిద్దరి భేటీ జరిగింది. తాడేపల్లి సీఎం క్యాంప్‌ ఆఫీస్‌లో సీఎంను డీజీపీ కలిశారు. దాదాపు అరగంట పాటు వీరిద్దరి మధ్య చర్చ సాగింది. ప్రధానంగా చలో విజయవాడ కార్యక్రమంపైనే చర్చ నడిచినట్లు తెలుస్తోంది. 


పోలీసు అడుగడుగునా ఆంక్షలు విధించినా కూడా చలో విజయవాడ కార్యక్రమం ఎలా విజయవంతమైందనే విషయంపై సీఎం, డీజీపీ చర్చించారట. అంతేకాదు ఉద్యోగులకు ఏమైనా పోలీసులు సహకరించారా అని సీఎం జగన్.. (CM YS Jagan) డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ను ప్రశ్నించారని విశ్వసనీయ సమాచారం. 


అలాగే ఉద్యోగుల రాకకు సంబంధించి ముందుగానే అంచనా వేయడంలో నిఘా వర్గాలు విఫలమైనట్లుగా ఏపీ సర్కార్‌‌కు ఫిర్యాదు అందాయి. దీంతో ఈ విషయంపై కూడా సీఎం, డీజీపై (DGP Gowtham Sawang) చర్చించారని తెలుస్తోంది.


అయితే ఉద్యోగులు పోలీసులు కళ్లుగప్పి మారువేషాల్లో విజయవాడకు  రావడం, కొందరేమో ముందుగానే విజయవాడకు వెళ్లి అక్కడే ఉన్నారని డీజీపీ.. సీఎం (CM)  జగన్‌కు తెలిపారని సమాచారం. అయితే భవిష్యత్తులో ఇలాంటి విషయాల్లో ఎలా వ్యవహరించాలనే దానిపై సీఎం జగన్... డీజీపీకి సూచనలు చేశారట. 


కాగా ఏపీ ప్రభుత్వం (AP Government) జారీ చేసిన పీఆర్సీ (PRC) జీఓలకు వ్యతిరేకంగా చేపట్టిన చలో విజయవాడ విజయవంతమైన నేపథ్యంలో ఎల్లుండి నుంచి సమ్మెకు (Strike) దిగుతున్నట్లుగా పీఆర్సీ సాధన సమితి నేతలు ఇప్పటికే ప్రకటించారు.


Also Read: Stock Market today: రెండో రోజూ నష్టాలతో ముగిసిన మార్కెట్లు- సెన్సెక్స్ 143 మైనస్​


Also Read: Zuckerberg Net Worth: మార్క్ జుకర్ బర్గ్​కు ఒక్క రోజులో రూ.2.2 లక్షల కోట్ల లాస్​!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook