AP Govt employees : ఏపీ సచివాలయంలో ఉద్యోగుల నిరసన.. సమ్మెకు రెండ్రోజులు ముందే కంప్యూటర్లు షట్‌డౌన్‌..!!

AP News: పీఆర్సీ జీవోలను రద్దు చేయాలంటూ ఏపీ సచివాయలంలో ఉద్యోగులు పెన్‌డౌన్‌ కార్యక్రమం చేపట్టారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 4, 2022, 03:10 PM IST
  • ఏపీ సచివాలయ ఉద్యోగుల పెన్‌డౌన్ కార్యక్రమం
  • శుక్రవారం సచివాలయంలో కంప్యూటర్లు షట్‌డౌన్
  • ఈ నెల 6 అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి ఉద్యోగులు
AP  Govt employees : ఏపీ సచివాలయంలో ఉద్యోగుల నిరసన.. సమ్మెకు రెండ్రోజులు ముందే కంప్యూటర్లు షట్‌డౌన్‌..!!

AP Secretariat employees pen down: ఏపీలో పీఆర్సీ (PRC) ఉద్యమం రోజురోజుకూ ఉద్ధృతమవుతోంది. పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా ఉద్యోగుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. పీఆర్సీ జీవోలను రద్దు చేయాలంటూ ఏపీ సచివాయలంలో ఉద్యోగులు పెన్‌డౌన్‌ (AP Secretariat employees pen down) కార్యక్రమం చేపట్టారు.

శనివారం సెలవు కావడంతో ఈరోజే సచివాలయంలో కంప్యూటర్లు షట్‌డౌన్ చేసి నిరసన వ్యక్తం చేశారు. దీంతో అక్కడ ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోయాయి. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు ఉద్యమం కొనసాగిస్తామని చెప్పారు. మరోవైపు 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు ఇప్పటికే ఉద్యోగ సంఘాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. 

'చలో విజయవాడ' కార్యక్రమం విజయవంతమైందని ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. ఉద్యోగులు స్వచ్చందంగా తరలి వచ్చారని.. విజయవాడ చరిత్రలో ఇటువంటి ఉద్యమం ఎన్నడూ చూడలేదన్నారు. కొందరు.. ప్రజల్లో ఉద్యోగుల పట్ల వ్యతిరేక భావన తెచ్చే ప్రయత్నం చేశారన్నారు. నిన్న అంత పెద్ద ఆందోళన జరిగినా...ప్రభుత్వం చూసి చూడనట్లు వ్యవహారించటం సరికాదన్నారు.

Also Read: AP Disputes: జగన్ సర్కార్‌కు దెబ్బ మీద దెబ్బ.. సినిమా టికెట్లు, ఉద్యోగుల సమ్మె, కొత్త జిల్లాలు..ఎలా చెక్ పెట్టబోతోంది..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News