YS Jagan Fires on CBN: వారి ముందు ఎర్రజెండా... వెనుకేమో పచ్చ జెండా ఉంటుందన్న ఏపీ సీఎం జగన్
Jagan Serious on Chandrababu Naidu over PRC Protest: చంద్రబాబు నాయుడుపై ఏపీ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులు సమ్మెకు దిగడం లేదనే అక్కసుతో కామ్రేడ్లను రెచ్చగొడుతున్నారంటూ జగన్ సీరియస్ అయ్యారు.
Jagan Reacts on PRC Protest: ఏపీలో పీఆర్సీ జోఓలను వ్యతిరేకిస్తూ చేపడుతోన్న ఆందోళనలు సమసిపోలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇంకా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉద్యోగుల జేఏసీ స్టీరింగ్ కమిటీ ఒప్పుకున్నంత మాత్రానా సరిపోతుందా అంటూ జేఏసీ నుండి బయటకి వచ్చిన ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొంటున్నారు. అంతేకాదు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు అయితే పీఆర్సీ సాధన సమితి నేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మొదట ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. పీఆర్సీ సాధన సమితి నేతలతో జరిపిన చర్చలు ఫలించినట్లుగా.. సమస్యలన్నీ తీరిపోయాయంటూ ఇరు వైపుల నుండి ప్రకటన వచ్చింది. అంతేకాదు ఉద్యోగ సంఘాల్లోని పలువురు కీలక నేతలు... జగన్ సర్కార్‌ను ప్రశంసించారు. జగన్ ప్రభుత్వం ఉద్యోగులకు అండగా ఉందంటూ పొగిడారు. ప్రభుత్వంలో ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమైందంటూ.. వారు ప్రభుత్వానికి ఎంతో సహకరిస్తున్నారని సీఎం జగన్ పేర్కొన్నారు.
మరోవైపు ఉద్యోగ సంఘాల నేతలు.. రాష్ట్ర ప్రభుత్వ కష్ట కాలంలో ఉన్న కూడా తమ డిమాండ్స్‌కు ఒకే చెప్పిందంటూ ప్రభుత్వాన్ని మెచ్చుకున్నారు. ఐఆర్ విషయంలో కాస్త అసంతృప్తి ఉన్నా.. హెచ్‌ఆర్‌ఏలో మాత్రం శ్లాబులను టీఎస్‌కు సమానంగా నిర్ణయించడంపై ఆనందం వ్యక్తం చేశారు ఉద్యోగ సంఘాల నేతలు.
అయితే పీఆర్సీ సాధన సమితి నేతల తీరుపై ఉపాధ్యాయుల సంఘాల నేతలు మండిపడ్డారు. పలు చోట్ల ఆందోళనలు చేపట్టారు. ప్రభుత్వంతో కుమ్మకై తమకు అన్యాయం చేశారంటూ ఏపీ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సంఘాల నేతలు మండిపడుతున్నారు.
ఈ క్రమంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎదుట ఎర్రజెండా పెట్టుకుని వెనుక పచ్చజెండా అనే చందంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారంటూ సీఎం జగన్ విమర్శలు లేవనెత్తారు. ఇక ఆ రెండు జెండాలు కలిసి రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారంటూ సీఎం విమర్శించారు. పేదల ఇళ్లను అడ్డుకున్న చంద్రబాబు నాయుడు కామ్రేడ్స్‌కు మిత్రుడు అని జగన్ ఆరోపించారు.
చంద్రబాబు నాయుడుకి సమ్మెలే కావాలని.. ఉద్యోగులు (Employees) ఆందోళనలు విరమించిన వెంటనే కామ్రేడ్స్‌ను రెచ్చగొట్టాడంటూ సీఎం జగన్ అన్నారు. ఆ ఎర్రజెండాల వెనుక పచ్చజెండా ఉందన్నారు. ఇక జగన్ (Jagan) ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేవలం సచివాలయం పోస్టులు తప్ప మరే ఇతర ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేయలేదంటూ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సంఘాల నేతలు ఆరోపించారు.
Also Read: Oscar 2022 Nominations: ఆస్కార్ 2022 నామినేషన్స్‌కి పోటీపడుతున్న చిత్రాల్లో జై భీమ్
Also Read: Digital beggar: మెడలో క్యూఆర్ కోడ్‌తో భిక్షాటన- ప్రధాని మోదీనే ఆదర్శమట!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook