Heavy Rains Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రమంతా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 48 గంటలు వాతావరణం ఇలాగే ఉండవచ్చని వాతావరణ శాఖ సూచిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వేసవిని తలపించే ఉక్కపోతతో అల్లాడిన తెలుగు ప్రజలకు ఉపశమనం కలుగుతోంది. బంగాళాఖాతం(Bay of Bengal)లో ఏర్పడిన అల్పపీడనం (Low Depression)కారణంగా గత 24 గంటలుగా రాష్ట్రమంతా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు (Heavy Rains)పడుతున్నాయి. గత 24 గంటల్లో కృష్ణా జిల్లాలోని పుట్రేలో అత్యధికంగా 9.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా..పశ్చిమ గోదావరి జిల్లా పోతవరంలో 8.4 సెంటీమీటర్ల వర్షం పడింది. ఇక విజయనగరం జిల్లాలో 7.7 సెంటీమీటర్లు, విశాఖలోని గొలుగొండలో 6 సెంటీమీటర్లు కురిసింది. 


శ్రీకాకుళం జిల్లాలో 11మిల్లీమీటర్లు, విజయనగరం జిల్లాలో 5.9 మిల్లీమీటర్లు, విశాఖలో 6.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అటు పశ్చిమ గోదావరి జిల్లాలో 8.1 మిల్లీమీటర్లు, కృష్ణా జిల్లాలో 4.9 మిల్లీమీటర్లు, చిత్తూరులో 4.1 మిల్లీమీటర్లు, అనంతపురంలో 4 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని ఐఎండీ పేర్కొంది. భారీ వర్షాల కారణంగా కృష్ణా జిల్లా తిరువూరులోని చౌటపల్లి-కొత్తూరు గ్రామాల మధ్య ఎదుళ్లవాగు పొంగి వరదతో పోటెత్తింది. ఫలితంగా రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అటు తోటమూల-వినగడప మధ్య కట్టలేరు వాగు పొంగి పొర్లింది. వచ్చే 48 గంటల్లో రాష్ట్రంలోని అత్యధిక ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చని ఐఎండీ(IMD) తెలిపింది. 


Also read: AP Corona Update: ఏపీలో గణనీయంగా తగ్గిన కరోనా, 24 గంటల్లో కేవలం 9 వందల కేసులు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook