రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపధ్యంలో అధికార పార్టీ అప్రమత్తమవుతోంది. ఇప్పటికే బీసీ ఓట్లను టార్గెట్ చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాపులపై ఫోకస్ చేసింది. రాజమండ్రిలో జరుగుతున్న వైసీపీ ఎమ్మెల్యేల భేటీలో కీలక విషయాలపై చర్చ జరుగుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారే పరిస్థితులు కన్పిస్తున్నాయి. జనసేన-టీడీపీ పొత్తుపై వస్తున్న వార్తల నేపధ్యంలో అధికార పార్టీ సమాలోచన చేస్తోంది. కాపుల్ని మభ్యపెట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. రాజమండ్రిలో వైసీపీ కాపు ఎమ్మెల్యేలతో భారీ భేటీ నిర్వహిస్తోంది. ఈ సమావేశంలో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్దఎత్తున పాల్గొన్నారు. దాదాపు 36 మంది కాపు ఎమ్మెల్యేలు, మంత్రులు భేటీకు హాజరయ్యారు. వైసీపీ కాపు కార్యకర్తలు, ఇతర నేతలు కూడా భేటీ జరుగుతున్న ప్రాంగణానికి చేరుకున్నా..కేవలం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలనే భేటీలో అనుమతిస్తున్నారు. 


జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చేందుకే భేటీ అని మీడియాలో వార్తలు వస్తున్నా..అసలు మర్మం వేరేగా ఉంది. ప్రతిపాదిత జనసేన-టీడీపీ పొత్తు కుదిరితే కాపు కార్యకర్తలు చెదిరిపోకుండా ఉండేందుకు, అండగా నిలిచేందుకు తీసుకోవల్సిన చర్యలపై భేటీలో చర్చిస్తున్నారు. పార్టీకు అండగా ఉన్న కాపు ఓటర్లను సమీకరించేందుకు ఏం చేయాలనేదానిపై చర్చలు జరుగుతున్నాయి. కాపు ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. 


మంత్రులు కన్నబాబు, బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్‌నాథ్, అంబటి రాంబాబు, దాడిశెట్టి రాజా, కొట్టు సత్యనారాయణ సహా మాజీ మంత్రులు పేర్ని నాని, పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, జక్కంపూడి రాజా, తోట త్రిమూర్తులు వంటి కీలకనేతలంతా హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 40 మంది కాపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కావల్సి ఉండగా..36 మంది వరకూ హాజరయ్యారు. జనసేన-టీడీపీ పొత్తు ప్రతిపాదనల నేపధ్యంలో కాపు సామాజికవర్గంలో పార్టీకు ఉన్న బలాన్ని సమీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 


మరోవైపు కాపులకు రిజర్వేషన్ విషయమై పార్టీ నిర్ణయం తీసుకుంటే ఎలా ఉంటుందనే విషయమై చర్చ నడుస్తోంది. కాపు కార్యకర్తలు, నేతలకు అండగా ఉండేందుకు, ధైర్యాన్నిచ్చేందుకు ఏం చేయాలనేది ప్రధానంగా చర్చ సాగుతోంది. ప్రభుత్వం అధికారంలో వచ్చిన తరువాత కాపు సామాజికవర్గానికి ఏం చేసింది, ఏం చేయాలనే విషయంపై అభిప్రాయాలు తీసుకుంటున్నారు. 


Also read: Ram Goapl Varma Vyuham: ఆర్జీవీ వ్యూహం సినిమాకు నా పాటలు ఇస్తా.. టీడీపీ నేత ఆఫర్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook