Schools Re-Open form tomorrow in AP after Dussehra 2022 Holidays: తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో శుక్రవారం (అక్టోబర్ 6) నుంచి స్కూళ్లు, కాలేజీలు పునః ప్రారంభం కానున్నాయి. 2022 దసరా సెలవులు ఇవాళ్టితో ముగియడంతో.. రేపటి నుంచి విద్యాసంస్థలు ఆరంభం కానున్నాయి. అయితే రెండో శనివారం, ఆదివారం నేపథ్యంలో రేపు చాలామంది విద్యార్థులు డుమ్మా కొట్టే అవకాశం ఉంది. సోమవారం (అక్టోబర్ 10) నుంచి పూర్తిస్థాయిలో విద్యార్థులు హాజరయ్యే అవకాశం ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాల విద్యార్థులకు సెప్టెంబర్‌ 26 నుంచి దసరా సెలవులు ప్రారంభం అయ్యాయి. అక్టోబర్ 6వ తేదీ వరకు ప్రభుత్వం దసరా సెలవులను ప్రకటించింది. మొత్తం 10 రోజులు పాటు విద్యార్థులకు ద‌స‌రా సెల‌వులు వచ్చాయి. క్రిస్టియన్‌, మైనారిటీ పాఠశాలలకు మాత్రం అక్టోబర్‌ 1 నుంచి 6 వరకు సెలవులు ఇచ్చారు.


మరోవైపు తెలంగాణలో సోమవారం (అక్టోబర్ 10) నుంచి స్కూళ్లు, కాలేజీలు పునః ప్రారంభం కానున్నాయి. తెలంగాణలో ప్రధాన పండుగలైన బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో.. అన్ని స్కూళ్లకు ప్ర‌భుత్వం సెప్టెంబర్ 26వ తేదీ నుంచి అక్టోబర్‌ 9 వరకు 15 రోజుల పాటు సెలవులు ప్రకటించించిన విష‌యం తెలిసిందే. ఇక అక్టోబర్‌ 10వ తేదీన అన్ని విద్యాసంస్థలు తిరిగి తెరుచుకోనున్నాయి.


Also Read: Sandeep Lamichhane Arrest: అత్యాచార ఆరోపణలు.. స్టార్‌ క్రికెటర్‌ అరెస్ట్‌!


Also Read: ఆ పేసర్ టీ20 ప్రపంచకప్‌ భారత జట్టులో లేకపోవడంతో షాక్ అయ్యా: బ్రెట్‌ లీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook