Sandeep Lamichhane Arrest: అత్యాచార ఆరోపణలు.. స్టార్‌ క్రికెటర్‌ అరెస్ట్‌!

Nepal Cricketer Sandeep Lamichhane arrested. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపాల్‌ స్టార్‌ క్రికెటర్‌ సందీప్ లామిచానే‌ అరెస్ట్ అయ్యాడు.   

Written by - P Sampath Kumar | Last Updated : Oct 6, 2022, 06:38 PM IST
  • అత్యాచార ఆరోపణలు
  • స్టార్‌ క్రికెటర్‌ అరెస్ట్‌
  • పోరాడేందుకు నేపాల్‌కు తిరిగి వస్తున్నా
Sandeep Lamichhane Arrest: అత్యాచార ఆరోపణలు.. స్టార్‌ క్రికెటర్‌ అరెస్ట్‌!

Nepal Cricketer Sandeep Lamichhane was arrested on Rape Case: నేపాల్‌ స్టార్‌ క్రికెటర్‌ సందీప్ లామిచానే‌ అరెస్ట్ అయ్యాడు. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న లామిచానే‌ను నేడు ఖాట్మండు పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు నెల రోజులు పాటు అజ్ఞాతంలో ఉన్న లామిచానే.. గురువారం (అక్టోబర్ 6) నెపాల్‌కు తిరిగి వచ్చాడు. నెపాల్‌లో అడుగు పెట్టిన వెంటనే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని ఖాట్మండు జిల్లా పోలీసు ప్రతినిధి దినేష్ రాజ్ మైనాలి ఏఎఫ్‌పికి తెలిపారు. 

నెపాల్‌కు వచ్చేముందు సందీప్ లామిచానే సోషల్‌ మీడియాలో ఓ ట్వీట్ చేశాడు. తనపై చేసిన అత్యాచార ఆరోపణలపై పోరాడేందుకు నేపాల్‌కు తిరిగి వస్తున్నట్లు పేర్కొన్నాడు. 'అత్యాచార ఆరోపణలపై పోరాడేందుకు నేను నేపాల్‌కు తిరిగి వస్తున్నా. నేను అన్ని దశల విచారణకు పూర్తిగా సహకరిస్తాను. నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి న్యాయ పోరాటం చేస్తాను. న్యాయాన్ని గెలిపించండి' అని లామిచానే‌ తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశాడు. 

2022 ఆగస్టులో 17 ఏళ్ల మైనర్‌ బాలిక.. సందీప్‌ లామిచానేపై అత్యాచార అరోపణలు చేస్తూ పోలీసులను ఆశ్రయించింది. బాలిక ఫిర్యాదు మేరకు పోలీస్‌లు కేసు నమోదు చేశారు. సెప్టెంబర్ 8న నేపాల్ న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఆ సమయంలో లామిచానే జమైకాలో కరీబియన్ ప్రీమియర్ లీగ్‌ ఆడుతున్నాడు. లామిచానే వ్యవహారం సీపీఎల్ టోర్నీ నిర్వాహకులకు తెలియడంతో అతడిని జట్టు నుంచి తొలగించారు. అప్పటి నుంచి స్వదేశానికి రాకుండా జమైకాలో ఉండిపోయాడు. మరోవైపు నేపాల్‌ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న అతడిపై వేటు వేసిన నేపాల్‌ క్రికెట్‌ బోర్డు.. జట్టులో నుంచి కూడా తొలగించింది.

Also Read: మొరిగే ప్రతి కుక్కపై రాళ్లు వేసేందుకు ఆగితే.. విమర్శలకు జస్ప్రీత్ బుమ్రా కౌంటర్‌!

Also Read: వెస్టిండీస్ బాహుబలి విధ్వంసం.. టీ20ల్లో డబుల్ సెంచరీ! 77 బంతుల్లో 205 రన్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

 

Trending News