ఏపీలో వార్ ప్రారంభమైపోయింది. ప్రభుత్వంతో పేచీకి దిగడం మానడం లేదు ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్. పంచాయితీ ఎన్నికల షెడ్యూల్, ఎన్నికల కోడ్ ఉత్తర్వులతో సై అంటే సై అంటున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ( Ap Sec Nimmagadda Ramesh kumar ) వర్సెస్ ప్రభుత్వం ( Ap Government ) మధ్య యుద్ధం ప్రారంభమైనట్టే. కరోనా వైరస్ ( Corona virus ) కారణంగా ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా లేమని ప్రభుత్వ అధికారులు చెబుతున్నా..ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించినా నిమ్మగడ్డ తన వైఖరి మానుకోవడం లేదు. మరోసారి పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసి వివాదాస్పదమయ్యారు. ప్రభుత్వం ఆగ్రహానికి గురయ్యారు. 


ఊహించినట్టే..షెడ్యూల్ విడుదల చేసిన కాస్సేపటికే ఎన్నికల్ కోడ్ ( Election code ) ఉత్తర్వుల్ని జారీ చేస్తూ సంక్షేమ పథకాల్ని నిలిపివేయాలని సూచించారు నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ( Nimmagadda Ramesh kumar ). ఇప్పటికే ప్రభుత్వం ప్రారంభించిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. మరోవైపు అమ్మఒడి ( Ammavodi scheme ) రెండో విడత కార్యక్రమాన్ని రేపు అంటే జనవరి 11న నెల్లూరు నుంచి ప్రారంభించనున్నారు. సంక్రాంతి పండుగ దృష్టిలో పెట్టుకుని పండుగకు ముందే తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తే ..ప్రయోజనంగా ఉంటుందనేది ప్రభుత్వ ఆలోచన. ఎన్నికల్ కోడ్ పేరుతో ఈ రెండు కార్యక్రమాల్ని నిలిపివేసేందుకు ఎన్నికల కమీషన్ దురాలోచన చేస్తుందని ప్రభుత్వం ఆరోపిస్తోంది. 


Also read: YSR Statue Vandalised: మొన్న ఆలయాలపై దాడులు.. నేడు వైఎస్సార్ విగ్రహంపై దాడి.. వైఎస్సార్‌సీపీ ఆగ్రహం


ఇప్పటికే ఎన్నికల్ని బహిష్కరిస్తున్నామని అటు ఛీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ ( Ap cs Adityanath das ), ఇటు ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించారు. మరోవైపు ఎస్ఈసీ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ప్రభుత్వం హౌస్ మోషన్ పిటీషన్ ( House motion petition ) హైకోర్టు ( High court ) లో దాఖలు చేసింది. ఈ పిటీషన్‌పై విచారణ కూడా జనవరి 11న జరగనుంది. ఇప్పటికే మంత్రులు ఆదిమూలపు సురేష్ ( Ap minister adimulapu suresh ), అనిల్ కుమార్ యాదవ్ ( Ap minister Anil kumar yadav ) ‌లు అమ్మఒడి కార్యక్రమం ఆగేది లేదని..కొనసాగుతుందని చెప్పడం ద్వారా ఎన్నికల కమీషన్‌కు సవాలు విసిరారు. ఎన్నికల షెడ్యూల్  విడుదలకు ముందే అమ్మఒడి పధకానికి సంబంధించి జీవో 3ను విడుదల చేశామని మంత్రి సురేశ్ స్పష్టం చేశారు. 


జనవరి 11వ తేదీన నెల్లూరులో ముఖ్యమంత్రి జగన్ ( Ap cm ys jagan ) కంప్యూటర్ బటన్ నొక్కడం ద్వారా  తల్లుల ఖాతాల్లో అమ్మ ఒడి నిధులు నేరుగా జమ కానున్నాయి. ఈసారి రెండో విడత కార్యక్రమంలో 44 లక్షల 891 మందికి అమ్మ ఒడి పథకం అమలుకానుంది. 


Also read: Jagananna Ammavodi Scheme: మనీ ఖాతాల్లో చేరేది ఎప్పుడంటే.. క్లారిటీ ఇచ్చిన మంత్రి ఆదిమూలపు సురేష్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook