YSR Statue Vandalised: మొన్న ఆలయాలపై దాడులు.. నేడు వైఎస్సార్ విగ్రహంపై దాడి.. వైఎస్సార్‌సీపీ ఆగ్రహం

YSR Statue Vandalised: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడులైంది. దీంతో దేవాలయాలపై నెలకొన్న వివాదం కాస్త నేతల విగ్రహాల ధ్వంసాలకు దారి తీస్తోంది. తాజాగా ఉమ్మడి ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహంపై గుర్తు తెలియని దుండగులు దాడిచేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 10, 2021, 12:14 PM IST
YSR Statue Vandalised: మొన్న ఆలయాలపై దాడులు.. నేడు వైఎస్సార్ విగ్రహంపై దాడి.. వైఎస్సార్‌సీపీ ఆగ్రహం

YSR Statue Vandalised: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడులైంది. దీంతో దేవాలయాలపై నెలకొన్న వివాదం కాస్త నేతల విగ్రహాల ధ్వంసాలకు దారి తీస్తోంది. తాజాగా ఉమ్మడి ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహంపై గుర్తు తెలియని దుండగులు దాడిచేశారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని బస్టాండ్‌ వద్ద ఉన్న వైస్సార్ విగ్రహం కుడి చేయి విరగొట్టారు.

శనివారం రాత్రి కొందరు అల్లరిమూక ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) తండ్రి, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం వైఎస్సార్ విగ్రహం కుడిచేతి విరగొట్టారు. ఆదివారం ఉదయం ఇది గమనించిన స్థానిక వైఎస్సార్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాయాలపై దాడులతో పాటు ప్రస్తుతం నేతల విగ్రహాలు సైతం విరగ్గొడుతున్నారంటూ, ఇది ప్రతిపక్షాల చర్య అని ఆరోపిస్తున్నారు.

Also Read: Jagananna Ammavodi Scheme: మనీ ఖాతాల్లో చేరేది ఎప్పుడంటే.. క్లారిటీ ఇచ్చిన మంత్రి ఆదిమూలపు సురేష్ 

కాగా, వైఎస్సార్(YSR) విగ్రహాన్ని ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఏపీలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన రావడంతో సీఎం వైఎస్ జగన్ తండ్రి, దివంగత నేత వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. ఆత్మకూరు ఎస్‌ఐ రవినాయక్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. విగ్రహం చేతి విరగడంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్టన్లు పోలీసులు తెలిపారు. 

Also Read: Lowest Interest Rate: పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News