ఏపీలో గణనీయంగా తగ్గిన కరోనా ఉధృతి, ఆంక్షల సడలింపు
AP Corona Update: ఏపీలో కరోనా తగ్గుదల స్థిరంగా కొనసాగుతోంది. గత కొద్దిరోజుల్నించి కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా తగ్గడంతో ప్రభుత్వం మరింతగా ఆంక్షల్ని సడలిస్తోంది.
AP Corona Update: ఏపీలో కరోనా తగ్గుదల స్థిరంగా కొనసాగుతోంది. గత కొద్దిరోజుల్నించి కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా తగ్గడంతో ప్రభుత్వం మరింతగా ఆంక్షల్ని సడలిస్తోంది.
ఏపీలో కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave) ప్రభావం గణనీయంగా తగ్గింది. గత కొద్దిరోజుల్నించి కరోనా కొత్త కేసులు 2 వేలలోపు నమోదవుతున్నాయి. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా ఆంక్షల్ని సడలిస్తోంది. ఈ నెల 16 నుంచి స్కూళ్లను తిరిగి తెరిచేందుకు నిర్ణయించింది. అటు పెళ్లిళ్లకు గరిష్టంగా 150 మంది వరకూ అనుమతించింది.
ఏపీలో గత 24 గంటల్లో 63 వేల 849 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా..1461 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణైంది. అటు 15 మంది కోవిడ్ కారణంగా మరణించారు. రాష్ట్రంలో మొత్తం 13 వేల 564 మంది కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు. గత 24 గంటల్లో రాష్ట్రంలో 2 వేల 113 మంది కోవిడ్ నుంచి కోలుకుని ఇంటికి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 19 లక్షల 52 వేల 736 మంది కోలుకున్నారని వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ ప్రకటించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 18 వేల 882 యాక్టివ్ కేసులున్నాయి. ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 19 లక్షల 85 వేల 182కు చేరుకుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 2 కోట్ల 53 లక్షల 11 వేల 733 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు(Covid19 Tests) చేశారు.
Also read: అభ్యర్ధులు నేరచరితను 48 గంటల్లో ప్రకటించాల్సిందే : సుప్రీంకోర్టు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook