AP SSC Time Table 2021: ఏపీలో పదో తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదలైంది. ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఏపీ టెన్త్ క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ 2021 షెడ్యూల్ బుధవారం నాడు విడుదల చేశారు. జూన్‌ నెల 7వ తేదీ నుంచి ఏపీలో 10వ తరగతి పరీక్షలు(AP 10th/ssc Class Board Exam 2021 Schedule) ప్రారంభం కానున్నాయని తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


జూన్ ఏడో తేదీ నుంచి జూన్ 16వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వివరించారు. పదో తరగతి పరీక్షలకు ఈ ఏడాది ఏడు పేపర్లుగా నిర్ణయించారు. టెన్త్ క్లాస్ బోర్డు పరీక్ష(Manabadi 10th Bord Exam Date 2021 )లలో సైన్సులో మాత్రమే రెండు పేపర్లు ఉంటాయన్నారు.


Also Read: AP Jobs 2021: ఏపీలో 2,296 Gramin Dak Sevak Postsకు నోటిఫికేషన్ విడుదల, పూర్తి వివరాలు


ఏపీ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ 2021 షెడ్యూల్‌ ఇదే(AP 10th Class Exam 2021 Schedule):


తేదీలు వారం పేపర్
జూన్‌  7 సోమవారం ఫస్ట్‌ లాంగ్వేజ్‌
జూన్‌ 8 మంగళవారం సెకండ్‌ లాంగ్వేజ్‌
జూన్‌ 9 బుధవారం ఇంగ్లీష్‌
జూన్‌ 10 గురువారం మ్యాథమేటిక్స్
జూన్‌ 11 శుక్రవారం ఫిజికల్‌ సైన్స్‌
జూన్‌ 12 శనివారం బయాలజీ
జూన్‌ 14 సోమవారం సోషల్‌ స్టడీస్‌
జూన్‌ 15 మంగళవారం ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌2, ఓఎస్‌ఎస్‌సీ మెయిన్‌ లాంగ్వేజ్, సంస్కృతం, అరబిక్‌, పర్షియన్
జూన్‌ 16 బుధవారం ఒకేషనల్‌ కోర్స్ (థియరీ)

 


 


 


 


 


 


 


 


 


 


 


 


 


జూన్‌ 5వ తేదీ వరకు 10వ తరగతి విద్యాలు క్లాసులు జరగుతాయని చెప్పారు. అదే విధంగా జూలై 21వ తేదీ నుంచే కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుందని మంత్రి ఆదిమూలపు సురేష్‌(Adimulapu Suresh) స్పష్టం చేశారు. ఇంటర్ పరీక్షలు పూర్తయిన తరువాతే టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్ ప్రారంభం అవుతాయని తెలిసిందే.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook