ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)లు బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానున్నాయి. తొలిసారిగా టెట్ పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మూడు పేపర్లకు 4,46,833 మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 183 టెట్ కేంద్రాలను విద్యాశాఖ ఏర్పాటు చేసింది. వీటిలో 159 రాష్ట్రంలోనూ, 24 ఇతర రాష్ట్రాల్లోనూ ఏర్పాటు చేసింది. మార్చి 3 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఫిర్యాదుల కోసం విద్యాశాఖ హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేసింది. పరీక్ష రాస్తున్న అంధులకు అదనంగా 50 నిమిషాలు కేటాయించారు.


పరీక్షలు ముగిసిన మరుసటి రోజు మార్చి 4న ప్రాథమిక 'కీ'ని విడుదల చేసి, మార్చి 9 వరకు అభ్యంతరాల స్వీకరిస్తారు. మార్చి 12న తుది 'కీ'ని, 16న ఫలితాలను విడుదల చేస్తారు. డిఎస్సీకి టెట్‌లో 20శాతం వెయిటేజ్‌ ఉంటుంది. టెట్‌ ఫలితాల విడుదల తర్వాత డీఎస్సీ నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజమహేంద్రవరంలో జరిగిన ఓ కార్యాక్రమంలో స్పష్టం చేశారు. డీఎస్సీ నిర్వహణ ఈసారి బాధ్యతను ఈసారి ఏపీపీఎస్సీకి అప్పగించామన్నారు.