AP TET Hall Tickets 2024 Released: ఆంధ్రప్రదేశ్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (TET) హాల్‌ టిక్కెట్లను అధికారికంగా విడుదల చేశారు. టెట్‌ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి అభ్యర్థులు నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. శనివారం రాత్రి నుంచి హాల్‌ టిక్కెట్లను అందుబాటులో ఉంచారు. టెట్‌కు సంబంధించిన రాత పరీక్ష అక్టోబర్‌ 3 నుంచి 20 వరకు నిర్వహిస్తారు. టెట్‌ పరీక్షకు హాజరవ్వనున్న అభ్యర్థులు ముందుగానే హాల్‌ టిక్కెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. అధికారిక వెబ్‌సైట్‌ aptet.apcfss.in ద్వారా నేరుగా హాల్‌ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హాల్‌ టిక్కెట్లు డౌన్‌లోడ్‌ చేసుకునే విధానం..
ముందుగా హోంపేజీలో ఉన్న ఏపీ టెట్‌ హాల్‌ టిక్కెట్లు (జూలై) 2024 ఆప్షన్‌ ఎంచుకోవాలి.


ఆ తర్వాత అభ్యర్థి ఐడీ, పుట్టిన తేదీ, వెరిఫికేషన్‌ కోడ్‌ నమోదు చేయాల్సి ఉంటుంది.
వీటి ద్వారా లాగిన్‌ చేసి హాల్‌ టిక్కెట్‌ను నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.


డౌన్‌లోడ్‌ చేసుకున్న హాల్‌ టిక్కెట్లను భవిష్యత్తు అవసరాల నిమిత్తం భాద్రంగా అభ్యర్థులు తమ వద్ద పెట్టుకోవాలి. పరీక్ష రాయడానికి ఇదే కీలకం. ఎగ్జామినేషన్‌ సెంటర్‌లోకి హాల్‌ టిక్కెట్లు ఉంటేనే అనుమతిస్తారు.టెట్‌ పరీక్షను కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. దాదాపు 18 రోజులపాటు ఈ పరీక్షలు వివిధ సెంటర్లలో నిర్వహించనున్నారు. ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్ష ఉంటుంది.


మొదటి సెషన్‌ ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది.
రెండో సెషన్‌ మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు.


ఇదీ చదవండి: 10 రోజులుగా నిలిచిపోయిన పౌరసేవాలు.. తీవ్ర ఇబ్బందుల్లో ప్రజలు.. ఎక్స్‌ వేదికగా మీ సేవా వివరణ..  



ఇదిలా ఉండగా ఈ ఏడాది టెట్‌కు అప్లై చేసుకున్నవారు పెద్ద ఎత్తున ఉన్నారు. మొత్తం 4,27,300 అభ్యర్థులు టెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు.ఇందులో 182,609 అభ్యర్థుు పేపర్‌ 1A సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ కేటగిరీకి దరఖాస్తు చేసుకున్నారు. 2,662 మంది 1B సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌కు దరఖాస్తు చేసుకున్నారు.
64,036 అభ్యర్థులు పేపర్‌ 2A లాంగ్వేజ్‌ కాగా 1,04,788 మంది అభ్యర్థులు మ్యాథ్స్‌, సైన్స్‌కు దరఖాస్తు చేసుకున్నారు.


టెట్‌ రాత పరీక్ష విజయవంతంగా రాసిన అభ్యర్థులకు సంబంధించిన ఫలితాలను ఏపీ ఎడ్యుకేన్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రైమరీ కీ అక్టోబర్‌ 4 నుంచి అందుబాటులో ఉంచనుంది. అభ్యర్థులు ప్రైమరీ కీ పై ఏవైనా సందేహాలు ఉంటే అక్టోబర్‌ 5 నుంచి సబ్మిట్‌ చేయవచ్చు. అయితే, ఏపీ టెట్‌కు సంబంధించిన ఫైనల్‌ కీ ని మాత్రం అక్టోబర్‌ 27న అందుబాటులో ఉంచునున్నారు. కాగా, ఏపీ టెట్‌ 2024 తుది ఫలితాలను మాత్రం నవంబర్‌ 2వ తేదీ విడుదల చేయవచ్చని చెబుతున్నారు.


ఇదీ చదవండి: రైల్వే ఉద్యోగాల భారీ నోటిఫికేషన్‌.. 3,445 పోస్టుల భర్తీ..  


ఏపీ టెట్‌ క్వాలిఫైయింగ్‌ మార్కులు ఓసీ అభ్యర్థులు 60 శాతం, బీసీ అభ్యర్థులు 50 శాతం, ఎస్టీ, ఎస్సీ, పీహెచ్‌, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ 40 శాతం పొందాలి. అర్హత పొందిన అభ్యర్థులు డిస్ట్రిక్‌ సెలక్షన్‌ కమిటీ (DSC) ఎగ్జామ్‌కు అర్హత సాధించవచ్చు. అయితే, డీఎస్సీకి అత్యధిక స్కోరును మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. ఈ అర్హతతో ఎన్నిసార్లైనా టెట్ కూడా రాసుకోవచ్చు.
 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.