Mee Seva service Down: మీసేవ సెంటర్ తెలంగాణ వ్యాప్తంగా గత 10 రోజులుగా సర్వీసులో అంతరాయం ఏర్పడింది. దీంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈనేపథ్యంలో తమ సర్వీసులను త్వరలో అంతరాయం లేకుండా పునరుద్ధరిస్తామని ఎక్స్ వేదికగా మీసేవ ప్రతినిధులుల తెలిపారు.
తెలంగాణ ఆన్లైన్ సర్వీస్ అందించే మీ సేవలో సర్వే పనులు ఆగిపోవడంతో ప్రజలు తీరు ఇబ్బందులు పడుతున్నారు అయితే పది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మీసేవ సెంటర్లలో సేవలు నేలపై నిలిచిపోయిన సంగతి తెలిసిందే .ముఖ్యంగా టెక్నికల్ ఫెయిల్యూర్ డేటా సెంటర్ లో లోపాల వల్ల ఈ నిలిచిపోతున్నాయి.
ఈ మీసేవ సర్వీసులో ఫెయిల్యూర్ వల్ల చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా జాబ్స్ కి హయ్యర్ ఎడ్యుకేషన్ కి అప్లై చేసుకునే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ విషయంపై ఈ సేవ కూడా ఎక్స్ హ్యాండిల్ లో వివరణ ఇచ్చుకుంది సర్వీసులను అతి త్వరలోనే పునరుద్ధరిస్తామని ప్రకటించింది.
మీసేవ సెంటర్లో టెక్నికల్ ఎర్రర్ వల్ల డాక్యుమెంట్స్ అప్లోడ్, చెల్లింపులు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో జూలై 10 నుంచి సెప్టెంబర్ 12 వరకు పెండింగ్ అప్లికేషన్స్ ఎక్కువ మొత్తంలో పేరుకున్నాయి కూడా.
ఈ సమస్యను నివారించడానికి ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ (ESD)పద్ధతిని పునరుద్ధరించేలా చూస్తున్నారు తద్వారా అప్లికేషన్స్ రీ అప్లోడ్, రీ సబ్మిట్ చేయవచ్చు. దరఖాస్తుదారులకు ఓ ఎస్‌ఎంఎస్ ద్వారా అప్డేట్ వస్తుంది అయితే సెప్టెంబర్ 13 తర్వాత జరిగిన అప్లికేషన్లకు యధావిధిగా కొనసాగుతాయి
మీ సేవ కేంద్రాల ద్వారా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేవారు, విద్యార్థులు ఆధాయ దృవపత్రం, క్యాస్ట్ సర్టిఫికేట్, కరెంట్ బిల్లు, ట్యాక్స్, ఇతర ధృవపత్రాల సేవలను పొందుతారు. రాష్ట్రవ్యాప్తంగా మీ సేవ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం టెక్నికల్ సమస్యల వల్ల పౌరసేవాలు నిలిచిపోయాయి.