ఏపీలో కొత్త గా రెండు థర్మల్ విద్యుత్ ప్లాంట్లు సిద్దమౌతున్నాయి. 16 వందల మెగావాట్ల విద్యుత్ అందుబాటులో రానుంది. వేసవి నాటికి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమయ్యేలా సన్నాహాలు జరుగుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


వేసవిలో విద్యుత్ కొరతను తగ్గించే దిశగా ఏపీ ప్రభుత్వం ( Ap Government ) చర్యలు తీసుకుంటోంది. కృష్ణపట్నం, ఇబ్రహీంపట్నంలలో నిర్మాణంలో ఉన్న రెండు థర్మల్ విద్యుత్ ప్లాంట్లను ( Thermal power plants ) త్వరగా పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మార్చ్ నాటికి అంటే వేసవికి ఈ విద్యుత్ ప్లాంట్లు ఉత్పత్తి ప్రారంభించేలా  ఏపీ జెన్ కో( Ap Genco ) సన్నాహాలు చేస్తోంది. ఈ రెండు విద్యుత్ ప్లాంట్లతో 16 వందల మెగావాట్ల విద్యుత్ అందుబాటులో రానుంది. దీంతో ప్రస్తుతం 5 వేల మెగావాట్లున్న జెన్ కో విద్యుత్ ఉత్పత్తి  6 వేల 5 వందల మెగావాట్లకు పెరగనుంది.


పర్యావరణానికి హాని కలగకుండా..ఫ్యూయెల్ గ్యాస్ డీ సల్ఫరైజేషన్ ప్లాంట్ల ఏర్పాటును కేంద్రం ( Central Government ) తప్పనిసరి చేసింది. ప్రస్తుతం న్యాయ సమీక్షలో ఉన్నాయని..పూర్తయిన వెంటనే వారం రోజుల్లో ఎఫ్ జీ డీ ప్లాంట్ల ఏర్పాటుకు టెండర్లు పిలవనున్నారు. ఈ పనులు జరుగుతుండగానేె...థర్మల్ పవర్ ప్లాంట్ల కార్యకలాపాలు చేపట్టే అవకాశాలున్నాయి.


కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో, నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో కొత్త ప్లాంట్ల ఏర్పాటును 2015లో ప్రారంభించారు. వాస్తవానికి ఇవి 2018 నాటికే పూర్తవ్వాలి. కానీ గత ప్రభుత్వం పొరపాట్ల కారణంగా నిర్మాణం నత్తనడకగా సాగిందని వైసీపీ ప్రభుత్వం విమర్శిస్తోంది. తమ ప్రభుత్వం అధికారంలో వచ్చాక..వేగం పెంచామని చెబుతోంది. 


వాస్తవానికి ప్రభుత్వం అధికారంలో వచ్చేనాటికి జెన్ కోకు స్థాయికి మించిన అప్పులున్నాయి. కొత్త అప్పులు అందే పరిస్థితి లేదు. పనుల్లో మరింత జాప్యం వల్ల నిర్మాణ వ్యయం పెరిగిపోయింది. విద్యుత్‌ ధర కూడా ఎక్కువయ్యే పరిస్థితి తలెత్తుతుంది. ఈ ప్రమాదాన్ని గుర్తించిన ప్రస్తుత ప్రభుత్వం ప్లాంట్ల నిర్మాణ ప్రక్రియలో వేగం పెంచింది. ఒక్కో ప్లాంట్‌కు  వేయి కోట్ల చొప్పున ప్రభుత్వమే గ్యారెంటీగా ఉండి అప్పు ఇప్పించేందుకు ముందుకు రావడంతో పనులు ప్రారంభమయ్యాయి.  Also read: AP: హైకోర్టు గ్యాగ్ ఆర్డర్‌పై స్టే విధించిన సుప్రీంకోర్టు