AP: దిశ తరహాలో అవినీతికి వ్యతిరేకంగా ప్రత్యేక బిల్లు
మహిళలపై అత్యాచారాలకు వ్యతిరేకంగా దేశంలోనే తొలిసారిగా దిశ చట్టం ( Disha Act ) ను తీసుకొచ్చిన ఏపీ ప్రభుత్వం ఇప్పుడు అవినీతికి వ్యతిరేకంగా ప్రత్యేక బిల్లు తీసుకురానుంది. అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టనుంది.
మహిళలపై అత్యాచారాలకు వ్యతిరేకంగా దేశంలోనే తొలిసారిగా దిశ చట్టం ( Disha Act ) ను తీసుకొచ్చిన ఏపీ ప్రభుత్వం ఇప్పుడు అవినీతికి వ్యతిరేకంగా ప్రత్యేక బిల్లు తీసుకురానుంది. అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టనుంది.
ఆంధ్రప్రదేశ్ లో అవినీతికి తావుండకూడదనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే దిశ చట్టంతో మహిళలపై అత్యాచారాలకు ప్రత్యేక ఫోకస్ పెట్టిన జగన్ ప్రభుత్వం ( jagan government ) ఇప్పుడు అవినీతి పై నడుం బిగించింది. అవినీతి నిరోధక చర్యలపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. దిశ తరహాలోనే అవినీతికి వ్యతిరేకంగా ( Against corruption ) అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేక బిల్లు ( special bill against corruption ) తీసుకురానున్నారు. దీనికోసం ప్రత్యేకే కసరత్తు నిర్వహించింది. అవినీతి నిరోధానికి సంబంధించి తీసుకోవల్సిన చర్యలపై నివేదిక సమర్పించాల్సిందిగా ప్రతిష్టాత్మక ఐఐఎం అహ్మదాబాద్ ( IIM Ahmedabad ) తో ఒప్పందమైంది గతంలో. ఈ ఒప్పందం ప్రకారం ఐఐఎం అహ్మదాబాద్ తన నివేదికను సీఎం జగన్ కు సమర్పించింది. అవినీతికి ఆస్కారమున్న కార్యాలయాలైన ఎమ్మార్వో, ఎండీఓ, సబ్ రిజిస్ట్రార్, మున్సిపల్, టౌన్ ప్లానింగ్ విభాగాల్లో ప్రత్యేక దృష్టి పెట్టేలా చర్యలు తీసుకోనున్నారు. గ్రామ, సచివాలయాల నుంచి వచ్చే ఫిర్యాదులను అనుసంధానిస్తారు. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాెండెడ్ గా దొరికితే నిర్ధిష్ట సమయంలోనే చర్యలు తీసుకోనున్నారు. ప్రభుత్వంలోని ప్రతి విభాగంలోనూ రివర్స్ టెండరింగ్ ఉంటుంది. టెండర్ విలువ కోటి దాటితే రివర్స్ టెండరింగ్ కు వెళ్లాల్సిందే. కర్నాలు జిల్లా పిన్నాపురం విద్యుత్ ప్రాజెక్టు, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టుల విషయంలో గతానికి ఇప్పటికీ తేడా స్పష్టమైనట్టు సీఎం జగన్ తెలిపారు. Also read: Suspension: తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు సస్పెండ్..మరో నలుగురు కూడా