Jr Ntr: లీడర్లు సైలెంట్.. కేడర్ ఫైర్! టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ రచ్చ..
Jr Ntr: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, పాన్ ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్ సమావేశం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వేడి రాజేస్తోంది. అమిత్ షా- తారక్ భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని.. కేవలం సినిమా సమావేశంగానే చూడాలని బీజేపీ నేతలు చెబుతున్నా.. ఈ విషయంపై రాజకీయ రచ్చ మాత్రం ఆగడం లేదు.
Jr Ntr: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, పాన్ ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్ సమావేశం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వేడి రాజేస్తోంది. అమిత్ షా- తారక్ భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని.. కేవలం సినిమా సమావేశంగానే చూడాలని బీజేపీ నేతలు చెబుతున్నా.. ఈ విషయంపై రాజకీయ రచ్చ మాత్రం ఆగడం లేదు. బాద్ షా- అమిత్ షా సమావేశంపై ఒక్కొక్కరు ఒక్కో కథ చెబుతూ మరింత మసాలా పుట్టిస్తున్నారు. వైసీపీ, జనసేన నేతలు ఏదో రకంగా స్పందిస్తుండగా.. తెలుగుదేశం పార్టీలో మాత్రం గందరగోళం నెలకొంది. జూనియర్ విషయంలో ఎలా స్పందిచాలో తెలియని స్థితిలో తమ్ముళ్లు ఉన్నారంటున్నారు.
తెలంగాణ పర్యటనకు వచ్చిన అమిత్ షాతో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశం కానున్నారని ప్రచారం సాగింది. రామోజీ ఫిల్మ్ సిటీలో వీళ్లిద్దరి కలవబోతున్నారనే వార్తలు వచ్చాయి. అయితే చంద్రబాబుతో అమిత్ షా సమావేశం జరగలేదు. కాని ఎవరూ ఊహించని విధంగా జూనియర్ ఎన్టీఆర్ ను ప్రత్యేకంగా పిలుపించుకుని మాట్లాడారు అమిత్ షా. దీంతో చంద్రబాబును పట్టించుకోకుండా తారక్ తో అమిత్ షా సమావేశం అయ్యారంటూ చర్చలు సాగుతున్నాయి. ఈ ఎపిసోడ్ టీడీపీని ఇబ్బందులకు గురి చేసిందని తెలుస్తోంది. 2009 అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీ కోసం రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేశారు తారక్. జూనియర్ ప్రచారానికి మంచి స్పందన వచ్చింది. కాని ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవలేకపోయింది. ఆ తర్వాత టీడీపీలోకి నారా లోకేష్ ఎంట్రీ ఇచ్చారు. లోకేష్ ఎంట్రీ తర్వాత టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు జూనియర్. దీంతో లోకేశ్ రాకతో పార్టీలో తనకు ప్రాధాన్యత తగ్గడం వల్లే టీడీపీకి దూరంగా ఉంటున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.
ఇటీవల కాలంలో టీడీపీ పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్ కు ఇవ్వాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఏకంగా చంద్రబాబు సొంత నియోజకవర్గంలోనే తారక్ కు మద్దతుగా పోస్టుర్లు, బ్యానర్లు వెలిశాయి. చంద్రబాబు పర్యటనలోనూ ఎన్టీఆర్ కు మద్దతుగా కొందరు నినాదాలు చేయడం సంచలనమైంది. ఈ పరిస్థితులు ఉండగానే బీజేపీ అగ్రనేత అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా సమావేశం కావడం టీడీపీలో రచ్చ రాజేసిందని తెలుస్తోంది. దీంతో అమిత్ షా- జూనియర్ భేటీపై ఎవరూ మాట్లాడవద్దని పార్టీ నేతలకు పెద్దల నుంచి సమాచారం వచ్చిందని సమాచారం. అందుకే ఈ అంశంలో తమ్ముళ్లు ఎవరూ మాట్లాడటం లేదు. ఎవరైనా మాట్లాడాల్సి వచ్చినా రాజకీయాలతో ముడిపెట్టకుండా సినిమా లింక్ పెట్టి మాట్లాడాలని సూచించారని చెబుతున్నారు. అమిత్ షా- జూనియర్ ఎన్టీఆర్ సమావేశంపై స్పందించిన టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న.. అందులో తప్పేమి లేదన్నారు. వాళ్లిద్దరి సమావేశాన్ని సినిమాపరంగానే చూడాలని చెప్పారు. త్రిపుల్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నటన అద్భుతంగా ఉందన్నారు బుద్దా వెంకన్న. తారక్ ను అభినందించడానికే అమిత్ షా పిలుపించి ఉండవచ్చన్నారు.
అమిత్ షా- జూనియర్ ఎన్టీఆర్ భేటీపై టీడీపీ పెద్ద నాయకులు ఆచితూచి స్పందిస్తుండగా.. ద్వితియ శ్రేణి నేతలు, కేడర్ మాత్రం ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీని బలహీనం చేసే ప్రయత్నాల్లో అమిత్ షా ఉండగా.. అతనితో జూనియర్ ఎలా సమావేశం అవుతారని ప్రశ్నిస్తున్నారు. టీడీపీని ఇబ్బంది పెట్టే చర్యలు ఎన్ని జరుగుతున్నా బయటికి రాని తారక్.. అమిత్ షాను మాత్రం కలవడానికి వెళ్లారని విమర్శిస్తున్నారు. సోషల్ మీడియాలోనూ టీడీపీ ఫోలవర్స్ జూనియర్ టార్గెట్ గా భారీగానే పోస్టులు పెడుతున్నారు. టీడీపీని ఇబ్బంది పెట్టే అమిత్ షా కుట్రలో తారక్ పావుగా మారారాని కొందరు కామెంట్ చేస్తున్నారు. తాత పేరును గొప్పగా చెప్పుకునే ఎన్టీఆర్.. తాత స్థాపించిన పార్టీకి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలకు సహకరించేలా వ్యవహరించడం దారుణమని మరికొందరు టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Jr Ntr Meet Amit Shah: జూనియర్ తో టీడీపీ ఖేల్ ఖతం! అమిత్ షా ప్లాన్ చెప్పిన కొడాలి నాని
Read Also: Ananya Nagalla Surgery: అక్కడ సర్జరీ చేయించుకున్న అనన్య.. మొదటికే మోసం రావడంతో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి