కరోనా వైరస్ ( Coronavirus ) కేసులు ప్రతిరోజూ గణనీయంగా పెరిగిపోతున్నాయి. ఎవ్వర్నీ వదలడం లేదు. రాజకీయ నేతలందర్నీవరుస పెట్టి పీడిస్తున్న వైరస్ ఇప్పుడు ఏపీలో మరో మంత్రిని సోకింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు ( Minister Muttamsetti srinivasa rao ) కు కరోనా వైరస్ సోకింది. స్వల్పంగా లక్షణాలు కన్పించడంతో మంత్రి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ ( Corona positive ) గా నిర్ధారణైంది. లక్షణాలు స్వల్పంగానే ఉండటంతో హోం ఐసోలేషన్ లోనే చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని..ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. మరోవైపు ఇటీవలి కాలంలో తనను కలిసినవారంతా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవల్సిందిగా సూచించారు. అటు మంత్రి కుమారుడికి కూడా పాజిటివ్ గా తేలడంతో ఆయన కూడా హో ఐసోలేషన్ లోనే ఉన్నారు. ఎవరికి ఏ అవసరం వచ్చినా ఫోన్ లో అందుబాటులో ఉంటానన్నారు.  


ఈ మధ్యనే పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యే సమయంలో అరకు, చిత్తూరు, కాకినాడ ఎంపీలకు కూడా కరోనా వైరస్ నిర్ధారణైంది. ఏపీలో ఇప్పటివరకూ 46 లక్షల 61 వేల కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా. పాజిటివ్ కేసుల సంఖ్య 5 లక్షల 75 వేలకు చేరుకుంది. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం 93 వేలే యాక్టివ్ కేసులున్నాయి. మిగిలినవారంతా చికిత్స అనంతరం కోలుకున్నారు. Also read: Prisoners: ఆ ఖైదీలిక సేఫ్..కరోనా నెగెటివ్