Rain Alert: దక్షిణ తమిళనాడు నుంచి పశ్చిమ విదర్బ వరకూ విస్తరించిన ద్రోణి అటు జార్ఘండ్, ఒడిశా మీదుగా ఉత్తరాంధ్ర వరకూ వ్యాపించి ఉంది. ఈ ద్రోణి కారణంగా నిన్న ఏపీలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. ఇవాళ కూడా కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడవచ్చని ఐఎండీ సూచించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మరోవైపు పశ్చిమ మహారాష్ట్ర వరకూ వ్యాపించిన ద్రోణి కేరళ నుంచి ఉత్తర తెలంగాణ వరకూ సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. ఫలితంగా కోస్తాంధ్రలో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదముందని హెచ్చరికలు జారీ చేసింది విపత్తు నిర్వహణ శాఖ. రేపు అంటే శుక్రవారం నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ ఎండల తీవ్రత పెరగవచ్చని ఐఎండీ అంచనా వేసింది.


నిన్న విజయనగరం జిల్లా గరివిడిలో గరిష్టంగా 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అటు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు నమోదయ్యాయి. అనకాపల్లిలో 5 సెంటీమీర్ల వర్షపాతం కురిసింది. ద్రోణి ప్రభావం వల్ల మార్చ్ నెలాఖరు వరకూ కోస్తాంధ్ర ప్రాంతంలో సాధారణ ఉష్ణోగ్రతలు, అటు రాయలసీమ ప్రాంతంలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది. 


ఉత్తర కోస్తాలో ఉరుములు, మెరుపులు ఉండవచ్చు. ఇవాళ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. పంట కోతలు కోసే సమయం కావడంతో అప్రమత్తంగా ఉండాల్సిందిగా వాతావరణ శాఖ హెచ్చరించింది. 


Also read: Ustaad Bhagat Singh Dialogue: వైరల్ అవుతున్న గాజు గ్లాస్ డైలాగ్, ఈసీ ఏం చేయనుంది



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook