AP Capital: ఇక కొత్త రాజధానులు త్వరలో ప్రారంభం
దేశంలో ఎక్కడా లేని విధంగా తొలిసారిగా ఓ రాష్ట్రానికి మూడు రాజధానుల ( 3 Capitals ) ఏర్పాటు అంశం ఇకపై కార్యరూపం దాల్చనుంది. ఏపీ పరిపాలనా బిల్లుకు ఇక మండలి ఆమోదం అవసరం లేదు. లాంఛనప్రాయంగా మిగిలిన గవర్నర్ ఆమోదంతో ఏపీలో మూడు కొత్త రాజధానులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి.
దేశంలో ఎక్కడా లేని విధంగా తొలిసారిగా ఓ రాష్ట్రానికి మూడు రాజధానుల ( 3 Capitals ) ఏర్పాటు అంశం ఇకపై కార్యరూపం దాల్చనుంది. ఏపీ పరిపాలనా బిల్లుకు ఇక మండలి ఆమోదం అవసరం లేదు. లాంఛనప్రాయంగా మిగిలిన గవర్నర్ ఆమోదంతో ఏపీలో మూడు కొత్త రాజధానులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి.
పరిపాలనలో నూతన సంస్కరణలతో సంచలనం రేపుతున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) ఆలోచన ఇకపై సాకారం దాల్చనుంది. ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) కు మూడు రాజధానుల్ని ఏర్పాటు చేస్తూ జగన్ ( Jagan ) చేసిన ఆలోచన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మూడు రాజధానుల ఏర్పాటులో భాగంగా ఏపీ డీ సెంట్రలైజేషన్ బిల్లు ( De Centralization Bill ) ను ఏపీ అసెంబ్లీ ( Ap Assembly ) రెండుసార్లు ఆమోదించింది. అయితే మండలిలో అదికార పార్టీకు బలం లేని కారణంగా ప్రతిపక్ష టీడీపీ దీనిని అడ్జుకుంది. ప్రాంతీయ సమానాభివృద్ధి బిల్లు -2020, సీఆర్డీఏ చట్టం-2014 ( CRDA Act 2014 ) రద్దు బిల్లును రాష్ట్ర అసెంబ్లీలో జనవరి 20న తొలిసారి, జూన్ 16న రెండోసారి ఆమోదించి మండలి ( Council ) కు పంపారు. అయితే అక్కడ ఆమోదం లభించలేదు. ఇప్పుడిక నియమిత కాలం కాస్తా జూలై 17 తో పూర్తయిపోయింది. దాంతో అదే బిల్లును గవర్నర్ ( Governor Approval ) ఆమోదం కోసం పంపించారు. లాంఛనప్రాయమైన ఈ ఆమోదం రెండుమూడు రోజుల్లో రానుందని తెలుస్తోంది. Also read: AP Districts: ఉగాది నాటికి కొత్త జిల్లాలు ప్రారంభం
నిబంధలు ఏం చెబుతున్నాయి:
వాస్తవానికి రెండోసారి అసెంబ్లీ ఆమోదించిన బిల్లును మండలికి పంపినప్పుడు మూడు ప్రత్యామ్నాయాలుంటాయి. మొదటిది యధావిధిగా తిరస్కరించడం, రెండవది సవరణలు చేయాలని పట్టుబట్టడం. ఇక మూడోది రెండోసారి బిల్లుపై నెల రోజుల పాటు నిర్లిప్తంగా ఉండిపోవడం. అసెంబ్లీ రెండోసారి మండలికి పంపినప్పుడు ఇదే జరిగింది. జూన్ 16 నుంచి జూలై 16 వరకూ ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోలేకపోయింది కౌన్సిల్. దాంతో ఆర్టికల్ 197 (2))(బి) ప్రకారం బిల్లు సాంకేతికంగా ఆమోదం పొందినట్టుగా భావించారు. దాంతో గవర్నర్ ఆమోదం కోసం పంపించారు. Also read: Corona Symptoms: కోవిడ్19 వైరస్ అదనపు లక్షణాలివే
ఇప్పుడు గవర్నర్ ఆమోదం తరువాత ఈ బిల్లు చట్టంగా రూపం దాల్చుతుంది. పరిపాలనా రాజధాని ( Executive Capital ) గా విశాఖపట్నం, శాసన రాజధాని ( Legislative capital ) గా అమరావతి, న్యాయ రాజధాని ( Judicial capital ) గా కర్నూలు ఏర్పడనున్నాయి. Also read: ఢిల్లీలో భారీ వర్షాలు.. చల్లచల్లగా దేశ రాజధాని