CID Case On Ramojirao: ప్రజల చిట్‌ఫండ్ డబ్బుల్ని నిబంధనలకు వ్యతిరేకంగా మళ్లించిన కేసులో సీఐడీ మార్గదర్శి సంస్థ చైర్మన్ రామోజీరావు, ఎండీ చెరుకూరి శైలజలు ఏ1, ఏ2లుగా చేరుస్తూ కేసు నమోదు చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాష్ట్రంలోని మార్గదర్శి కార్యాలయాల్లో సోదాల అనంతరం పెద్దఎత్తున అక్రమాలు జరిగినట్టు గుర్తించింది సీఐడీ. మార్గదర్శి చిట్‌ఫండ్ కంపెనీ నిధుల మళ్లింపు వ్యవహారమై రాష్ట్రవ్యాప్తంగా సీఐడీ తనిఖీలు నిర్వహించింది. చిట్‌ఫండ్ చట్టాన్ని ఉల్లంఘించి ఖాతాదారుల సొమ్ము మళ్లించడం, నిబంధనలు ఉల్లంఘించడం వంటి ఆరోపణలతో సీఐడీ ఈ సోదాలు నిర్వహించింది. మార్గదర్శి మేనేజర్లు, సంస్థకు చెందిన కీలక అధికారులు ఇళ్లలో సైతం సీఐడీ సోదాలు జరిపింది. విజయవాడలోని మార్గదర్శి మెయిన్ బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాస్‌ను సీఐడీ అధికారులు అదుపులో తీసుకుని విచారించారు. 


1982 చిట్‌ఫండ్ చట్టం ప్రకారం సెక్షన్ 120బి,  409,420,477(a)రెడ్ విత్ 34  ఐపీసీతో పాటు..సెక్షన్ 5, ఏపీ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్ ఇన్ ఫైనాన్షియర్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం కింద సీఐడీ రామోజీరావు తదితరులపై కేసు నమోదు చేసింది. ఇందులో ఏ1గా చెరుకూరి రామోజీరావు, ఏ2గా చెరుకూరి శైలజ, ఏ3గా బ్రాంచ్ మేనేజర్లపై కేసులు నమోదయ్యాయి.


గతంలో విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, విజయవాడ, గుంటూరు, పల్నాడు, కర్నూలు, అనంతపురం చిట్స్ అసిస్టెంట్ రిజిస్ట్రార్‌లు ఫిర్యాదు మేరకు విశాఖ, రాజమండ్రి, ఏలూరు, గుంటూరులో సీఐడీ సోదాలు చేపట్టింది. నర్శరావుపేట, ఏలూరు, అనంతపురం శాఖల ఫోన్‌మెన్ పరారీలో ఉన్నట్టు సీఐడీ తెలిపింది. ప్రస్తుతం మార్గదర్శి కార్యాలయాలపై సోదాలు ఇంకా కొనసాగుతున్నాయని వెల్లడించింది.


Also read: AP BJP: బీజేపీ తీర్ధం పుచ్చుకోనున్న మాజీ ముఖ్యమంత్రి, ఎప్పుడంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook