APCID Notices: మార్గదర్శి చిట్‌ఫండ్స్ కేసు దర్యాప్తును ఏపీసీఐడీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ కేసులో ఏపీసీఐడీ రామోజీరావు, శైలజా కిరణ్‌లను మరోసారి ప్రశ్నించనుంది. విచారణకు హాజరుకావల్సిందిగా 41 ఏ నోటీసులు జారీ చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసులో ఊహించనంత భారీ కుంభకోణం దాగుందని. ఆ పరిస్థితి తలెత్తకుండా ఉండేందుకే విచారణ చేస్తున్నామని ఏపీ సీఐడీ తెలిపింది. మార్గదర్శి సంస్థ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రజల్నించి సేకరించిన చిట్ డబ్బుల్ని ఇతర సంస్థల్లోకి పెట్టుబడులు పెడుతున్నారు. చట్ట ప్రకారం ఇది నేరం. మార్గదర్శి సంస్థపై ఏపీసీఐడీ మూడు చట్టాల ప్రకారం కేసు నమోదు చేసింది. ఐపీసీ సెక్షన్ 120 బి, 409,స 477 ఏ రెడ్ విత్ 34 కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. అదే విధంగా ఏపీ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఇన్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ 1999 సెక్షన్ 5 ప్రకారం  కేసు నమైదైంది. మరోవైపు చిట్ ఫండ్స్ చట్టం 1982 సెక్షన్ 76,79 ప్రకారం కేసులు నమోదయ్యాయి. వీటిలో ఏ1గా రామోజీరావు, ఏ2గా శైలజా కిరణ్ ఉన్నారు. 


ఈ కేసులో ఇప్పటికే మార్గదర్శికి చెందిన ఆస్థుల్ని ఏపీసీఐడీ స్వాధీనం చేసుకుంది. దాదాపు వేయి కోట్ల ఆస్థుల్ని రెండు దశల్లో స్వాధీనం చేసుకోనుంది. ఈ కేసులో ఇప్పటికే రామోజీరావు, శైలజా కిరణ్‌లను ఏపీ సీఐడీ రెండు సార్లు ప్రశ్నించింది. ఈసారి ఈ ఇద్దరూ జూలై 5న గుంటూరులోని సీఐడీ కార్యాలయానికి హాజరుకావాలని సూచించింది.


Also read: AP Weather Updates: ఏపీకి రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాలో భారీ వర్షాలు


1962 ఆగస్టు 31న ప్రారంభించిన మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో శాఖలున్నాయి. ఏపీలో 37 శాఖలు, 2,351 చిట్ గ్రూపులు ఉన్నాయి. మొత్తం లక్ష మంది చందాదారులున్నారు. 


Also read: Pawan Kalyan Janasena: రెమ్యునరేషన్‌పై పవన్‌ కల్యాణ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook