రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం ( Water Dispute ) నేపధ్యంలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ ( Apex Council meeting ) సమావేశం ఎవరికి అనుకూలమైంది..ఎవరికి కాదనే విషయం పక్కన బెడితే..తెలంగాణ ప్రతిపక్ష పార్టీలు కేసీఆర్ పై విమర్శలు చేస్తూనే...వైఎస్ జగన్ కు మద్దతు పలుకుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల ( Telangana projects ) విషయంలో ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ), తెలంగాణ ( Telangana ) రాష్ట్రాల మధ్య వివాదం పెరిగి పెద్దదై..అపెక్స్ కౌన్సిల్ కు చేరింది. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదంపై ఢిల్లీ ( Delhi ) లో అపెక్స్ కౌన్సిల్ సమావేశం వాడివేడిగా సాగింది. రాష్ట్రాల ప్రయోజనాల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గట్టిగానే వాదించారు. కృష్ణా బేసిన్‌లో ఆంధ్రప్రదేశ్, గోదావరి బేసిన్‌లో తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులపై పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాలలో కొత్తగా చేపడుతున్న తొమ్మిది ప్రాజెక్టుల పనులను తక్షణమే ఆపాలని అపెక్స్ కౌన్సిల్ స్పష్టం చేసింది. ఇందులో 7 ప్రాజెక్టులు తెలంగాణ పరిధిలోనే ఉన్నాయి.


ఈ నేపధ్యంలో ఢిల్లీ సమావేశం అనంతరం తెలంగాణ పార్టీల నుంచి ఏపీ సీఎం వైెస్ జగన్ మోహన్ రెడ్డి ( Ap cm ys jagan mohan reddy ) కు పూర్తిగా మద్దతు పెరిగిపోయింది. అదే సమయంలో తెలంగాణ సీఎం కేసీయార్ ( Telangana cm kcr ) పై ఆ రాష్ట్ర రాజకీయపార్టీలు మండిపడుతున్నాయి. జగన్ వాదన ముందు కేసీఆర్ వాదన తేలిపోయిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణ ప్రయోజనాలను కాపాడటంలో కేసీఆర్ విఫలమైనట్టు బీజేపీ, కాంగ్రెస్ లు ఆరోపణలు చేస్తున్నాయి. Also read: Cyberabad Commissioner: సజ్జనార్ ఫెవరెట్ క్రికెటర్ ఎవరో తెలుసా?


తెలంగాణ రాష్ట్రంలో నిర్మితమవుతున్న ప్రాజెక్టులకు, ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులకు నీటి కేటాయింపుల విషయంలో కేసీఆర్ వ్యవహార శైలి కారణంగా నష్టం జరగటం ఖాయమని తేలిపోయిందంటూ బీజేపీ నేత బండి సంజయ్ మండిపడ్డారు. జల వివాదంలో ఏపిని  తేలిగ్గా తీసుకున్న కారణంగానే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ వెనక్కి తగ్గాల్సివచ్చిందని బండి సంజయ్ ( Bjp leader Bandi Sanjay ) విమర్శించారు. కోర్టుల్లో కేసులు ఉపసంహరించుకునేది లేదని, ప్రాజెక్టులపై డీపీఆర్లు సమర్పించేది లేదని చెప్పిన కేసీయార్ ఢిల్లీ సమావేశంలో ఎందుకు వెనక్కి తగ్గారని ప్రశ్నించారు.


అటు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సైతం కేసీఆర్ పై విమర్శలు ఎక్కుపెట్టింది. తెలంగాణ జలాల పరిరక్షణలో కేసీఆర్ ఫెయిల్ అయ్యారని ఆరోపించారు. కేసీఆర్ వైఖరి కారణంగానే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో జగన్ వాదన హైలైట్ అయిందన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో జగన్ వినిపించినట్లు కేసీఆర్ తన వాదనను ఎందుకు వినిపించలేకపోయారో ప్రజలకు సమాధానం చెప్పాలని నిలదీశారు.


మరోవైపు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి డీకే అరుణ సైతం కేసీఆర్ పై మండిపడ్డారు. ముఖ్యమంత్రి నిర్లక్ష్య వైఖరి కారణంగానే తెలంగాణా వాదన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో వీగిపోయిందన్నారు. అటు ఏపి జల సంరక్షణ కోసం జగన్ చేసిన వాదనలో తప్పేమీ లేదన్నారు. Also read: YSRCP ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి రెండోసారి కరోనా.. ఏపీలో తొలి కేసు