APPSC Group 1 Hall Tickets: ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షలకు అంతా సిద్ధమైంది. మార్చ్ 17 న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ఉంది. ఏపీపీఎస్సీ అధికారిక పోర్టల్  https://portal-psc.ap.gov.in/లో హాల్ టికెట్లు రేపట్నించి అంటే మార్చ్ 10 నుంచి అందుబాటులో ఉంటాయని ఏపీపీఎస్సీ వెల్లడించింది. మార్చ్ 17న గ్రూప్ 1 ప్రిలిమినరీ పేపర్ 1, 2 పరీక్షలు జరగనున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 81 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇందులో డిప్యూటీ కలెక్టర్ పోస్టులు 9, ట్యాక్స్ అసిస్టెంట్ కమీషనర్ పోస్టులు 18, డీఎస్పీ 26, ఆర్టీవో పోస్టులు 6, డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టులు 5, జిల్లా ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్ పోస్టులు 4, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి 3, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ 3, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ 2, జైళ్ల శాఖ సూపరింటెండెంట్ 1, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ 1, మున్సిపల్ కమీషనర్ గ్రేడ్ 2 పోస్టు 1, ఎక్స్చైజ్ సూపరింటెండెంట్ 1 ఖాళీలున్నాయి. 


గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష 240 మార్కులకు పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఇందులో పేపర్ 1 లో 120 మార్కులు, పేపర్ 2లో 120 మార్కులుంటాయి. ఒక్కో పేపర్‌కు 2 గంటల సమయం ఉంటుంది. మార్చ్ 17వ తేదీ ఉదయం 10 గంటల్నించి మద్యాహ్నం 12 గంటల వరకూ పేపర్ 1 పరీక్ష ఉంటుంది. ఇక మద్యాహ్నం 2 గంటల్నించి 4 గంటల వరకూ పేపర్ 2 ఉంటుంది. మెయిన్స్‌లో మొత్తం 5 పేపర్లుంటాయి. లాంగ్వేజ్ పరీక్షలు కూడా ఉంటాయి కానీ ఇవి క్వాలిఫయింగ్ పరీక్షలుగా ఉంటాయి. ఐదు పేపర్లకు కలిగి 750 మార్కులుంటాయి. మెయిన్ అనేది రాత పరీక్ష. మెయిన్స్ కూడా ఉత్తీర్ణత సాధిస్తే 75 మార్కులకు ఇంటర్వ్యూ ఉంటుంది. 


గ్రూప్ 1 కు అప్లై చేసిన అభ్యర్ధులు తమ తమ హాల్ టికెట్లను ఏపీపీఎస్సీ అధికారిక పోర్టల్  https://portal-psc.ap.gov.in/ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ముందుగా సైట్ ఓపెన్ చేసి అందులో కన్పించే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 రిక్రూట్‌మెంట్ హాల్ టికెట్ క్లిక్ చేయాలి. అక్కడ అడిగిన వివరాలు సమర్పించాలి. అంతే స్క్రీన్‌పై మీ హాల్ టికెట్ డిస్‌ప్లే అవుతుంది. 


Also read: Timesnow ETG Survey: ఈసారి ఏపీలో అధికారం ఎవరిది, తేల్చేసిన టైమ్స్ నౌ-ఈటీజీ తాజా సర్వే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook