APSRTC Non AC Sleeper Buses: ప్రయాణిలకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్ అందించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఇక నుంచి కొత్త బస్సులు రోడెక్కనున్నాయి. నాన్ ఏసీ స్లీపర్ బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఏపీఎస్ఆర్టీసీ తెలిపింది. ఈ బస్సులను స్టార్ లైనర్ పేరుతో నడుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఏపీఎస్ఆర్టీసీ నాన్ ఏసీ స్లీపర్ బస్సు సర్వీసులను ప్రవేశ పెట్టినట్లు ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా బస్సులో కల్పించే వసతులను కూడా వివరించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బస్సు 2+1 స్లీపర్ కోచ్, 30 కుషన్ సాఫ్ట్ బెర్త్‌‌లు ఉంటాయని అధికారులు తెలిపారు. ఇందులో ఛార్జింగ్ పోర్ట్స్, రీడింగ్ లాంప్స్, లగేజీ ర్యాక్స్, ఆడియో కోచ్‌ సౌకర్యాలు కూడా ఉంటాయని చెప్పారు. ఈ సరికొత్త బస్సుకు సంబంధించిన ఫొటోను షేర్ చేశారు. అదేవిధంగా ఈ స్టార్ లైన్ బస్సులను ఏయే రూట్లలో ఏ సమయాల్లో నడుస్తాయన్నది త్వరలోనే వివరాలు వెల్లడిస్తామన్నారు. 


ఆంధ్రప్రదేశ్‌లో తీసుకువచ్చిన ఈ నాన్ ఏసీ స్లీపర్ బస్సులు దూర ప్రాంత ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడనున్నాయి. అయితే టికెట్ ధరలు కూడా సాధారణ ప్రజలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ బస్సులకు మరింత ఆదరణ తీసుకువచ్చేందుకు ప్రజల నుంచి సలహాలు, సూచనలు కోరుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 62 స్టార్ లైనర్ బస్సు సర్వీసులను నడిపేందుకు ప్లాన్ చేస్తున్నారు. ముందుగా కొన్ని రూట్లలో బస్సులను నడిపి.. ఆదరణ పెరిగితే బస్సుల సంఖ్య మరింత పెంచుతామని అధికారులు చెబుతున్నారు. 


 




ఇప్పటివరకు కేవలం ప్రైవేట్ బస్సుల్లోనే నాన్ ఏసీ స్లీపర్ బెర్త్‌లు ఉండగా.. తొలిసారి ఏపీఎస్ఆర్టీసీ ఈ బస్సులను ప్రవేశపెట్టడం పట్ల ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వెన్నెల పేరుతో ఏసీ స్లీపర్ బస్సు సర్వీసులను నడుపుతోంది ఆర్టీసీ. నాన్ ఏసీ స్లీపర్ బస్సులతో ఆదాయం పెరుగుతుందని ఆర్టీసీ భావిస్తోంది. 


ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ఏపీఎస్ఆర్టీసీ మరో సరికొత్త టూర్‌ను కూడా ప్రారంభించింది. తక్కువ రేట్లకే తక్కువ రేట్లకే విహారయాత్ర చేయండి - మధురస్మృతులను పొందండి అంటూ ప్రయాణికులకు పిలుపునిస్తోంది. మన్యసీమ దర్శినికి సంబంధించి అధికారులు ట్వీట్ చేశారు. ఇప్పటికే ఏపీలో బస్సుల్లో డిజిటల్ చెల్లింపులు కూడా అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ఇటు శబరిమలతో పాటూ అరుణాచలంకు కూడా ప్రత్యేక బస్సు సర్వీసులను ఆర్టీసీ నడుపుతోంది.  


Also Read: IND vs NZ: కివీస్ తో ఆఖరి టీ20 నేడే.. ఉమ్రాన్, సంజూలకు ఛాన్స్ ఇస్తారా?


Also Read: Priyanka Jawalkar SIzzling Photos: తెలుగమ్మాయి ప్రియాంక పరువాల విందు.. వైట్ డ్రెస్ లో దేవకన్యలా వలపువల!


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook