APSRTC offer to Tirumala Piligirms: తిరుమల శ్రీవారి భక్తుల సౌకర్యార్థం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. తిరుపతి-తిరుమల మధ్య రాకపోకలను సులభతరం చేసేలా నూతన విధానాన్ని తీసుకొచ్చినట్లు పేర్కొంది. కొత్త విధానం ప్రకారం తిరుపతి బస్సు టికెట్ పైనే తిరుమలకు రాకపోకలు సాగించే సదుపాయం కల్పిస్తారు. తిరుపతి బస్సు టికెట్ సహా శ్రీవారి దర్శనానికి టికెట్ బుక్ చేసుకున్నవారికి ఈ సదుపాయం కల్పించనున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తిరుపతి చేరుకున్న తర్వాత 72 గంటల పాటు ఈ టికెట్ చెల్లుబాటు అవుతుంది.  తిరుపతి ఏడుకొండలు బస్టాండ్ లేదా అలిపిరి బాలాజీ బస్టాండ్ నుంచి తిరుమలకు బస్సులో వెళ్లవచ్చు. తిరుమల రాకపోకలకు టికెట్ తీసుకునేవారికి టికెట్ ధరపై 10 శాతం రాయితీ కూడా ఇవ్వనున్నట్లు ఆర్టీసీ ఈడీ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. గురువారం (ఫిబ్రవరి 3) నుంచి ఈ కొత్త విధానాన్ని అమలులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. శ్రీవారి భక్తులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. 


కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని శ్రీవారి భక్తులు తగిన జాగ్రత్తలు పాటించాలని బ్రహ్మానందరెడ్డి సూచించారు. బస్సులో (APSRTC) ప్రయాణించేటప్పుడు అందరూ ముఖానికి మాస్క్ ధరించాలన్నారు. కాగా, ఈ నెల 8న తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు జరగనున్నాయి. కరోనా నేపథ్యంలో ఈసారి ఏకాంత వాహన సేవలు నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. ఉదయం 6గంటలకు సూర్యప్రభ వాహన సేవతో మొదలై రాత్రి 9గంటలకు చంద్రప్రభ వాహన సేవతో ఈ వేడుకలు ముగుస్తాయి.


Also Read: పుట్టు మచ్చలెన్ని ఉన్నాయంటూ ప్రశ్నించిన జర్నలిస్టు.. హీరోయిన్ రియాక్షన్ ఏంటంటే?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook