Asani Cyclone: అసనీ తుఫాన్ ఆంధ్రప్రదేశ్ లో అల్లకల్లోలం స్పష్టిస్తోంది. అసనీ దుసుకొస్తుడంటంతో తీరంలో అలజడి నెలకొంది. తుఫాన్ ప్రభావంతో కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురు గాలులు బీభత్సం స్పష్టిస్తున్నాయి. సముద్రం కల్లోలంగా మారింది. అసనీ ఎఫెక్ట్ ఏపీ, ఒడిశాతో పాటు పలు దేశాలపైనా కనిపిస్తోంది. సముద్ర తీర ప్రాంతాల్లో అలలు ప్రమాదకరంగా ఎగిసిపడుతున్నాయి. తీరంలోని సంపద గల్లంతవుతోంది. సుదూర ప్రాంతాలకు వెళ్లిపోతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలల తీవత్రకు శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం సున్నాపల్లి సముద్ర తీరానికి ఓ మందిరం కొట్టుకొచ్చింది. గమనించిన స్థానికులు తాళ్ళతో కట్టి ఒడ్డుకు చేర్చారు.  మెరైన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ రథంపై  16-1-2022 అని విదేశీ బాషలో రాసి ఉంది. దీంతో ఇది మలేషియా, థాయిలాండ్ లేదా జపాన్ దేశాలకు చెందినది అయి ఉండవచ్చునని కొంతమంది సీమెన్ లు అంటున్నారు. ఈ స్వర్ణ రధాన్ని మెరైన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇది ఎక్కడి నుండి వచ్చింది, ఎలా వచ్చిందని ఆరా తీస్తున్నారు.



 


తీరానికి కొట్టుకువచ్చిన బంగారు రథాన్ని చూసేందుకు స్థానికులు తరలివస్తున్నారు. గతంలో ఏపీలో పెద్ద తుపానులు వచ్చాయని, అయినా ఇలాంటి రథాన్ని ఎప్పుడు చూడలేదని స్థానికులు చెబుతున్నారు.  ఇటీవల వచ్చిన తుఫాన్ సమయంలో తూర్పు గోదావరి జిల్లా సముద్ర తీరానికి గోల్డ్ కాయిన్స్ కొట్టుకువచ్చాయి.  


READ ALSO: Cyclone Asani: కాకినాడ, విశాఖ పోర్టులకు గ్రేట్ డేంజర్ సిగ్నల్ జారీ.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్... 


READ ALSO: Apple Ipod Touch: యాపిల్ కీలక నిర్ణయం... ఇక 'ఐపాడ్ టచ్'కు స్వస్తి...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook