Apple Ipod Touch: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ దిగ్గజం యాపిల్.. 'ఐపాడ్ టచ్' ఉత్పత్తులను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం మార్కెట్లో ఐపాడ్ టచ్ లేటెస్ట్ వెర్షన్ విక్రయాలు కొనసాగుతున్నాయని... అయితే ప్రస్తుతం ఉన్న సప్లై వరకే విక్రయాలు ఉంటాయని పేర్కొంది. 2001లో పోర్టబుల్ ఐపాడ్‌ను ప్రవేశపెట్టిన యాపిల్... 2007లో ఐపాడ్ టచ్ వెర్షన్‌ని తీసుకొచ్చింది. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ల వినియోగం, ఇంటర్నెట్ విస్తృతి పెరిగిన నేపథ్యంలో కేవలం మ్యూజిక్ కోసం ఐపాడ్ వినియోగించేవారి సంఖ్య తగ్గిపోయింది. ఈ నేపథ్యంలోనే యాపిల్ ఐపాడ్ టచ్ వెర్షన్‌ని నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఐపాడ్ టచ్ లేటెస్ట్ వెర్షన్‌ని 2019లో తీసుకొచ్చారు. దీని ధర 199 డాలర్లు. ఈ ఐపాడ్‌లో కేవలం మ్యూజిక్ ఫీచర్ మాత్రమే కాకుండా ఐమెసేజెస్, ఫేస్ టైమ్ కాల్స్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. అయితే ఇందులో ఫోన్ కాల్స్ చేసుకునే ఫీచర్ మాత్రం లేదు.
2001లో ఐపాడ్ ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకూ పలుమార్లు ఐపాడ్ వెర్షన్‌ని యాపిల్ అప్‌గ్రేడ్ చేస్తూ వచ్చింది. అయితే ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్లు, మ్యూజిక్ యాప్స్ వినియోగం పెరగడంతో ఐపాడ్‌కి ఆదరణ తగ్గింది.ఐపాడ్ ఉత్పత్తులను నిలిపివేస్తున్నప్పటికీ... ఇతర మ్యూజిక్ ప్రొడక్ట్స్ రూపంలో దాని స్పిరిట్ కొనసాగుతుందని యాపిల్ వరల్డ్ వైడ్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గ్రెగ్ జోస్వియక్ పేర్కొన్నారు.
Also Read: Narayana Bail: మాజీ మంత్రి నారాయణకు ఊరట... పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో బెయిల్...
Also Read: Horoscope Today May 11 2022: రాశి ఫలాలు.. ఇవాళ ఈ రాశుల వారికి ఆశాజనకమైన ఫలితాలు ఉంటాయి...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook