Ashok Gajapati Raju: ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి, కేంద్ర మాజీ మంత్రి అశోక గజపతిరాజుకు మధ్య వివాదం కొనసాగుతున్న తెలిసిందే. సింహాచలం, మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ బాధ్యతల నుంచి అశోక గజపతిరాజును తొలగించడం దగ్గరి నుంచి ఇటీవలి రామతీర్థ ఘటన వరకూ ఇరువురి మధ్య వైరం అంతకంతకూ పెరుగుతూ వచ్చింది. కోర్టులను ఆశ్రయించి సింహాచలం, మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్ బాధ్యతలను తిరిగి చేపట్టినప్పటికీ... అధికారుల నుంచి ఆయనకు సహాయ సహకారాలు అందట్లేదు. దానికి తోడు ఇటీవల ఆయనకు కారు టెన్షన్ కూడా పట్టుకుందనే ప్రచారం జరుగుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సింహాచలం ట్రస్టు ఛైర్మన్‌గా వ్యవహరించేవారికి ప్రభుత్వం కారును కేటాయిస్తుంది. ఛైర్మన్‌గా పునర్నియామకం తర్వాత అశోక గజపతిరాజుకు దాదాపు నెలన్నర రోజుల తర్వాత కారును కేటాయించారు. అయితే ఆయనకు పంపించిన కారుపై నేమ్ బోర్డు లేదు. గతంలో ఛైర్మన్లుగా వ్యవహరించినవారికి నేమ్ బోర్డుతో కూడిన కారు... దాని నిర్వహణకు నెలవారీ ఖర్చుల కింద కొంత డబ్బును ఇచ్చేవారు. సంచయిత ఛైర్మన్‌గా ఉన్నప్పుడు ఆమెకు కేటాయించిన కారు నిర్వహణకు ప్రభుత్వం ప్రతీ నెలా రూ.75వేలు కేటాయించేది. అయితే అశోక గజపతి రాజు విషయంలో ప్రభుత్వం వాటన్నింటినీ లైట్ తీసుకుంది.


ఈ నేపథ్యంలో తన కారుకు నేమ్ బోర్డు కోసం అశోక గజపతిరాజు (Ashok Gajapati Raju) పలుమార్లు సింహాచలం ఈవోతో మాట్లాడటమే కాదు ఆయన్ను గట్టిగానే నిలదీశారు. దీంతో అధికారులు ఆయన కారుకు 'ప్రభుత్వ వాహనం' అనే స్టిక్కర్ అతికించి పంపించారట. అసలే ప్రభుత్వంతో వైరం కొనసాగుతున్న తరుణంలో 'ప్రభుత్వ వాహనం' అని రాసి ఉన్న ఆ కారులో బయటకు వెళ్లేందుకు ఆయన ఇష్టపడట్లేదట. ఆ కారును వాడితే లేనిపోని ప్రచారాలకు తావిచ్చినట్లవుతుందని దాన్ని దూరం పెడుతున్నట్లు చెబుతున్నారు. అధికారుల వెంబడి పడి మరీ తెప్పించుకున్న కారును అశోక గజపతి రాజు పూర్తిగా దూరం పెట్టడం చర్చనీయాంశమైంది.


Also Read: Shocking Viral Video: మిరాకిల్.. పిడుగుపడ్డా అతను బతికి బయటపడ్డాడు... వీడియో వైరల్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook