Nellore Crime news: నెల్లూరులోని (Nellore) ఓ ప్రైవేట్‌ కళాశాలకు చెందిన బీ ఫార్మసీ విద్యార్థుల నిర్వాకం వల్ల యువకుడు మృతి చెందాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అసలేం జరిగిందంటే...
ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కామేపల్లి గ్రామానికి చెందిన బి.శ్రీకాంత్‌ (28)కు పెళ్లియంది. వివాహమయిన ఆరునెలలకే భార్య విడిచి వెళ్లిపోయింది. దీంతో శ్రీకాంత్‌ ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఒంగోలులో నివాసముంటున్నాడు. అతడికి విశాఖకు చెందిన మోనాలీసా అనే హిజ్రాతో పరిచయం ఏర్పడింది. 


తక్కువ ఖర్చుతో ఆపరేషన్‌ చేస్తామని..
ఆరు నెలల క్రితం ఓ యాప్‌ ద్వారా శ్రీకాంత్‌, మోనాలిసాలకు నెల్లూరులోని బీఫార్మసీ విద్యార్థులు (B Pharmacy Students) పరిచయమయ్యారు. అయితే శ్రీకాంత్‌ హిజ్రాగా మారాలని నిర్ణయం తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో....శస్త్రచికిత్స చేయించుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న బీఫార్మసీ స్టూడెంట్స్ తామే తక్కువ ఖర్చుతో ఆపరేషన్‌ చేస్తామని ముందుకొచ్చారు. 


ఈనెల 23న నెల్లూరులోని ఓ లాడ్జీలో గదిని అద్దెకు తీసుకుని మస్తాన్‌, జీవా అనే బీ ఫార్మసీ విద్యార్థులు శ్రీకాంత్‌కు శస్త్ర చికిత్స ప్రారంభించారు. దీని కోసం మోనాలీసా సాయం తీసుకున్నారు. శ్రీకాంత్‌ మర్మాంగాన్ని కోసేయడంతో అతడికి తీవ్ర రక్తస్రావమైంది. పల్స్‌ పడిపోవడం, మోతాదుకు మించి మందులు వాడటంతో కాసేపటికే శ్రీకాంత్‌ మరణించాడు. దీంతో నిందితులు భయంతో అక్కడి నుంచి పరారయ్యారు. ఈ విషయాన్ని గుర్తించిన లాడ్జీ సిబ్బంది పోలీసులకు కంప్లైంట్ చేశారు. మృతుడి వద్ద లభించిన ఆధారాలతో కుటుంబసభ్యులకు సమాచారమందించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


Also Read: YS Vivekananda Murder Case: ప్రాణ భయం ఉందన్న అప్రూవర్ దస్తగిరి.. రక్షణ కల్పించాలని ఎస్పీకి విజ్ఞప్తి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook